Business Ideas: మహిళలకు గుడ్ న్యూస్...ఇంటి వెనుక స్థలం ఉంటే చాలు నెలకు రూ. 1 లక్ష మీ సొంతం..ఏం చేయాలంటే..?

First Published | Sep 15, 2023, 6:54 PM IST

మహిళలు వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా.. అయితే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ తో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు ప్రతి నెల 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయలు సంపాదించాలి అనుకున్నట్లయితే, ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ ను గురించి ఇక్కడ  సమాచారం అందజేశాం. తద్వారా మీరు ఆదాయం పొందే అవకాశం ఉంది. 

మహిళలు మీరు గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్లయితే, ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ మీకోసం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఆర్గానిక్ కోడిగుడ్లను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఆర్గానిక్ కోడిగుడ్లు అంటే ఎలాంటి రసాయనాలు వాడకుండా నాటు కోళ్ల నుంచి సేకరించిన గుడ్లు వీటి ద్వారా మార్కెట్లో లభించే సాధారణ కోడిగుడ్ల కన్నా కూడా కాస్త ఎక్కువ అలాగే వీటికి డిమాండ్ కూడా చాలా బాగుంది. 

నాటు కోడిగుడ్లను పెంచేందుకు పావు ఎకరం నుంచి అరె ఎకరం స్థలం అయితే సరిపోతుంది మీ ఇంటి పెరడు సైతం నాటుకోడిగుడ్ల  ఉత్పత్తికి సరిపోతుంది. మీరు పెద్ద ఎత్తున నాటుకోడిగుడ్ల పెంపకాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నట్లయితే చిన్న షెడ్డుని నిర్మించుకోవాల్సి ఉంటుంది.  అనంతరం  షెడ్డులో  డ్రిప్  పద్ధతిలో పైపులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.  రైతుల వద్ద నుంచి నాటుకోడి పిల్లలను సేకరించాల్సి ఉంటుంది.  అనంతరం వీటిని సాంప్రదాయ పద్ధతుల్లో కోళ్ల ఫారం లో కాకుండా ఫీల్డ్ లో తిరగాడేలా పెంచినట్లయితే కోళ్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.  పగలంతా ఫీల్డులో తిరిగిన తర్వాత రాత్రిళ్ళు షెడ్డులో విశ్రాంతి తీసుకునేలా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.


ఇక కోడిగుడ్లను  పొదిగేందుకు ఇంక్యూబేటర్ ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.  నాటుకోడి గుడ్లను ఇంక్యుబేటర్ ద్వారా పొదిగేలా చేయవచ్చు.  అయితే నాటు కోళ్ల పెంపకంలో రెండు రకాలను పాటించాల్సి ఉంటుంది కొన్ని కోడిగుడ్లను టోకుగా విక్రయించేందుకు సిద్ధం చేసుకోవాలి. మరికొన్నింటిని పొదిగేందుకు సిద్ధంగా పెట్టుకోవాలి. . తద్వారా మీరు కోళ్ల సంఖ్యను పెంచుకోవచ్చు.  అదేవిధంగా కోడిగుడ్లను కూడా మార్కెట్లో విక్రయించుకోవచ్చు.  కోళ్ల సంఖ్యను పెంచడం ద్వారా మీరు మార్కెట్లో నాటు కోళ్లను అమ్ముకోవచ్చు.  సాధారణ బాయిలర్ కోడి కన్నా కూడా నాటుకోడి ధర ఎక్కువగా ఉంటుంది.  అదేవిధంగా నాటు కోడిగుడ్ల ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. 

ముఖ్యంగా జాతరలు పండుగలు ఇతర  సాంప్రదాయ వేడుకల్లో ప్రజలు నాటు కోళ్లను తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. అదే విధంగా ఆరోగ్య స్పృహతో ఉన్నవారు నాటు కోడిగుడ్లను తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మీరు నాటు కోళ్లను కోడిగుడ్లను ఉత్పత్తి చేసుకున్న తర్వాత.  నేరుగా కస్టమర్లకు విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  ఇందుకోసం మీరు సమీపంలోని ఒక షాపును ఏర్పాటు చేసుకొని అందులో కోడిగుడ్లను,  కోళ్లను విక్రయించడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు. ఈ తరహా నాటు కోళ్ల ఫారం ద్వారా మీరు దాణా ఖర్చు తగ్గుతుంది.  అదేవిధంగా నిర్వహణ ఖర్చు కూడా చాలా తగ్గుతుంది.  ఈ తరహా వ్యాపారంలో మీరు నెలకు 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. 

Latest Videos

click me!