ఇకపై 2000 రూపాయల నోటు తీసుకోము.. ! క్యాష్ ఆన్ డెలివరీకి కొత్త కండిషన్..

First Published | Sep 15, 2023, 12:12 PM IST

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్  డెలివరీ సర్వీస్‌లో రూ.2,000 నోట్లను తీసుకోవడం సెప్టెంబర్ 19 నుంచి నిలిపివేయనుంది. రూ.2,000 నోటును మార్చుకోవడానికి లేదా డిపాజిట్ చేయడానికి గడువు సమీపిస్తున్న తరుణంలో ఈ అప్‌డేట్ వచ్చింది.
 

రూ.2000 నోట్లను మార్చుకునేందుకు లేదా డిపాజిట్ చేసేందుకు ఆర్బీఐ ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది.

“అమెజాన్ ప్రస్తుతం రూ. 2,000 కరెన్సీ నోట్లను తీసుకుంటుంది. అయితే, సెప్టెంబరు 19, 2023 నుండి క్యాష్ ఆన్ డెలివరీ (COD) మోడ్ ద్వారా అమెజాన్‌లో ఆర్డర్‌ల కోసం చేసే  పేమెంట్ పై  మేము ఇకపై రూ. 2,000 నోట్లను అంగీకరించము” అని అమెజాన్ తెలిపింది.

మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు లేదా బ్యాంకు అకౌంట్లో  డిపాజిట్ చేసేందుకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అవసరమైతే గడువును మరింత పొడిగించే అవకాశం ఉందని కూడా కొందరు చెబుతున్నారు.

Latest Videos


నవంబర్ 2016లో రాత్రికి రాత్రే రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన తర్వాత వాటి స్థానంలో రూ.2000 నోట్లను ప్రవేశపెట్టారు.

మే 19 నాటికి దేశంలో చెలామణిలో ఉన్న రూ.2000 నోట్లలో 93 శాతం ఇప్పటికే బ్యాంకులకు తిరిగి వచ్చినట్లు సెప్టెంబర్ 1న ఆర్బీఐ తెలిపింది. ఆగస్టు 31 వరకు చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ.2000 నోట్ల మొత్తం విలువ రూ.3.32 లక్షల కోట్లు అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
 

చెలామణి నుండి ఉపసంహరించబడిన 2000 రూపాయల నోట్లలో 87 శాతం బ్యాంకు ఖాతాలలో జమ చేయబడ్డాయి; మిగిలిన 13 శాతం ఇతర కరెన్సీ నోట్లలోకి మారినట్లు వివిధ బ్యాంకుల నుంచి సమాచారం వెల్లడైంది.

click me!