దీవాలీ రికమండేషన్స్.. ఈ దీపావళికి ఈ స్టాక్స్ కొంటే 2023 దీపావళికి కోటీశ్వరులు అవ్వడం ఖాయం..

First Published Oct 18, 2022, 6:01 PM IST

గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెర్టర్ లో నష్టాల బాట పడుతున్నారు.  అంతేకాదు అనేక స్టాక్స్ ఒడిదుడుకులకు  లోనవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 2021 నాటి  దీపావళి తో పోలిస్తే  సుమారు 2-3 శాతం పడిపోయాయి. గ్లోబల్ ఈవెంట్‌లు, USతో సహా అనేక దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను తీవ్రంగా పెంచడం వల్ల స్టాక్ మార్కెట్లు ఒత్తిడిలో ఉన్నాయి.

 దీపావళి అనగానే ట్రేడర్లు కొత్త స్టాక్స్ కొని వచ్చే దీపావళి వరకు అవి రెండింతలు లాభాలు ఇవ్వాలని కోరుకుంటారు.  మార్కెట్లో ట్రేడర్లకు   దీపావళి సెంటిమెంట్ బలంగా ఉంటుంది.  అందుకు తగ్గట్టే స్టాక్స్ కూడా కొనుగోలు చేస్తారు.  ప్రస్తుతం ప్రముఖ బ్రోకరేజి సంస్థలు సిఫార్సు చేసిన టాక్స్ గురించి తెలుసుకుందాం. 

స్టాక్ మార్కెట్‌లో  ఎన్నో గందరగోళాలు ఉన్నప్పటికీ,  మార్కెట్ నిపుణులకు భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తోంది.  అలాంటి కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం. బ్రోకరేజ్ హౌస్ IDBI క్యాపిటల్ కూడా ఈ దీపావళి 2022 కోసం కొన్ని ముహూరత్ స్టాక్స్ రికమండేషన్స్  సూచించింది. ముహూరత్ ట్రేడింగ్‌లో వాటిని కొనుగోలు చేయడం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను ప్రకాశవంతం చేయవచ్చని బ్రోకరేజ్ చెబుతోంది.

అవెన్యూ సూపర్‌మార్ట్స్  (Avenue Supermarts) : ఈ స్టాక్ ప్రస్తుత మార్కెట్ ధర రూ.4,337. ఐడీబీఐ క్యాపిటల్ ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.5,148గా నిర్ణయించింది. వచ్చే దీపావళి నాటికి, ఈ స్టాక్ 19 శాతం రాబడిని ఇవ్వగలదు.
 

మహీంద్రా CIE ఆటోమోటివ్  (Mahindra CIE Automotive) : ఈ షేర్  ప్రస్తుత మార్కెట్ ధర రూ. 304. ఐడీబీఐ క్యాపిటల్ ఈ స్టాక్ టార్గెట్ ధరను రూ.381గా నిర్ణయించింది. వచ్చే దీపావళి నాటికి, ఈ స్టాక్ 25 శాతం రాబడిని ఇవ్వగలదు.

జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ (Jubilant FoodWorks) : ఈ స్టాక్‌కు కూడా చాలా సంభావ్యత ఉందని IDBI క్యాపిటల్ అభిప్రాయపడింది. ప్రస్తుతం రూ.604 వద్ద ట్రేడవుతోంది. ఈ స్టాక్‌ను రూ.767 టార్గెట్‌తో కొనుగోలు చేయాలని బ్రోకరేజీ అభిప్రాయపడింది. వచ్చే దీపావళి నాటికి ఈ స్టాక్ 27 శాతం రాబడిని ఇవ్వగలదు.

కోల్టే-పాటిల్ డెవలపర్స్ (Kolte-Patil Developers): IDBI క్యాపిటల్ ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉంది. ప్రస్తుతం రూ.344 వద్ద ట్రేడవుతోంది. బ్రోకరేజ్ టార్గెట్ ధరను రూ.460గా నిర్ణయించింది. వచ్చే దీపావళి వరకు 34 శాతం రాబడిని ఇవ్వవచ్చు.

(నోట్: ఇది పెట్టుబడి సలహా కాదు, పైన పేర్కొన్న స్టాక్‌లు బ్రోకరేజ్ హౌస్‌ సమాచారం ఆధారంగా ఉంటుంది. మీరు దేనిలోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే, దయచేసి ముందుగా సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్‌ను సంప్రదించండి. మీ పెట్టుబడిపై కలిగే ఏదైనా లాభం లేదా నష్టానికి ఏషియానెట్ బాధ్యత వహించదు. )

click me!