ఆపిల్ తాజా స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 16 తక్కువ ధరకు అందించేందుకు జెప్టో ఆన్ లైన్ షాపింగ్ యాప్, వెబ్ సైట్ మంచి ఆఫర్లు ప్రకటించింది. దీపావళి పండగను పురస్కరించుకొని వినియోగదారులకు ఆనందం పంచాలని జెప్టో సంస్థ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది.
జెప్టో 2021 జులైలో ముంబైలో ప్రారంభమైన కిరాణా సరకులు డోర్ డెలివరీ చేసే సంస్థ. రాకెట్ వేగంతో ఎదిగి మార్కెట్లో సత్తాచాటుతోంది. ముంబై ప్రధాన కేంద్రంగా సేవలందిస్తున్న జెప్టో ఒక్క ముంబైలోనే 250 స్టోర్స్ ఉన్నాయి. ఇది దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న సంస్థ. ఆదిత్ పాలిచా, కైవల్య వోహ్రా ఇద్దరూ కలిసి ఈ సంస్థను స్టార్ట్ చేశారు. ఆగస్ట్ 2024 నాటికి ఈ కంపెనీ విలువ $5 బిలియన్ల కంటే ఎక్కువ. భారతదేశంలోని పది మెట్రోపాలిటన్ ప్రాంతాలలో 250 డార్క్ స్టోర్‌లను నిర్వహిస్తోంది. ప్రస్తుతం వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తోంది.
జెప్టో కంపెనీ అనేది కిరాణా సరకులను డోర్ డెలివరీ చేసే సంస్థ. కరోనా టైమ్ లో ప్రారంభమైన ఈ సంస్థ కేవలం 10 నిమిషాల్లోనే సరకులు ఇంటికి చేరుస్తామని చెప్పింది. చెప్పినట్లుగానే వినియోగదారులకు సకాలంలో సరకులు అందిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆ నమ్మకంతోనే ఇప్పుడు గ్రోసరీస్ తోపాటు ఇతర సరకులు డెలివరీని చేపట్టింది. దీపావళికి ఇచ్చిన ఆఫర్ ఐఫోన్ 16ని ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో ఉచితంగా ఇంటికి చేరుస్తామని చెబుతోంది. విజయ్ సేల్స్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా నడుస్తోంది. మీ దగ్గర పాత ఫోన్ ఉంటే దాన్ని ఇచ్చి ఐఫోన్ 16పై ఇంకా ఎక్కువ తగ్గింపు పొందవచ్చు.
Apple ఇటీవలే iPhone 16 సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.79,000 నుంచి రూ.1,10,000 వరకు ఉన్నాయి. సెప్టెంబర్ 10న iPhone 16 సిరీస్ రిలీజ్ అయ్యాయి. ఐఫోన్ 16 సిరీస్ విక్రయాలు పెంచేందుకు యాపిల్ ఇండియాలో iPhone పాత మోడళ్లను నిలిపివేసింది.
ఐఫోన్ 16 శక్తివంతమైన A18 చిప్‌తో వస్తుంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్‌లకు అనువైన పనితీరు, సామర్థ్యం దీని సొంతం.ఇందులో మాక్రో ఫోటోల కోసం 2x టెలిఫోటో జూమ్, అల్ట్రా వైడ్ లెన్స్‌తో 48 MP ఫ్యూజన్ కెమెరా ఉన్నాయి. 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లే అద్భుతమైన విజువల్స్‌ని అందిస్తుంది.
ఐఫోన్ 16 మన్నికైనది. నీరు, దుమ్ము నిరోధక డిజైన్‌తో ఐదు రంగుల్లో ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లలో కొత్తగా చేర్చిన యాక్షన్స్ బటన్ కెమెరా, ఫ్లాష్‌లైట్ వంటి ఫీచర్లను త్వరగా యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీని వాడకాన్ని విస్తరించే అప్‌డేట్ ఈ ఏడాది చివర్లో వస్తుందని ఆపిల్ చెప్పింది.
iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max ఉన్నాయి. సెప్టెంబర్ 10న అఫీషియల్ గా 'ఇట్స్ గ్లోటైమ్' ఈవెంట్ నిర్వహించి లాంచ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ అభిమానులు కొత్త సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. సెప్టెంబర్ 13 నుంచే ప్రీ-ఆర్డర్‌లు ప్రారంభమయ్యాయి. వినియోగదారుల నుంచి iPhone 16 సిరీస్ ఫోన్ల కోసం ఆర్డర్లు పెరుగుతున్నాని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.