బిల్లును చాలా ముఖ్యం, పారవేయకుండా దాచుకోండి..
BIS వెబ్‌సైట్ ప్రకారం, నగల వ్యాపారి/రిటైలర్ జారీ చేసిన బిల్లు/ఇన్‌వాయిస్ తప్పనిసరిగా హాల్‌మార్క్ చేయబడిన వస్తువుల వివరాలను కలిగి ఉండాలి. హాల్‌మార్క్ చేయబడిన విలువైన మెటల్ ఆర్టికల్‌ల విక్రయానికి సంబంధించిన బిల్లు లేదా ఇన్‌వాయిస్‌లో ప్రతి వస్తువు వివరాలు, బంగారం నికర బరువు, క్యారెట్లు హాల్‌మార్కింగ్ రుసుము పేర్కొనాలి. బంగారు గొలుసులో రాళ్లు ఉంటే, స్వర్ణకారుడు ఆ రాళ్ల ధర బరువును ఇన్‌వాయిస్‌లో ప్రత్యేకంగా పేర్కొనాలి.