ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగింపు.. చివరి తేదీ, వివరాలు తెలుసుకోండి..

Ashok Kumar   | Asianet News
Published : Sep 10, 2021, 02:01 PM ISTUpdated : Sep 10, 2021, 02:03 PM IST

ఆదాయపు పన్ను చెల్లింపుదారులు  ఐ‌టి రిటర్నులు దాఖలు చేయడానికి ప్రభుత్వం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కరోనావైరస్ మహమ్మారి, వెబ్‌సైట్‌లో టెక్నికల్ సమస్యల కారణంగా ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువు  పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

PREV
14
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు పొడిగింపు.. చివరి తేదీ, వివరాలు తెలుసుకోండి..

కరోనావైరస్ మహమ్మారి కారణంగా  మే నెలలో చివరిసారిగా సెప్టెంబర్ 30 వరకు తేదీని పొడిగించారు.

"ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో పన్ను చెల్లింపుదారులు, ఇతర స్టేక్ హోల్దర్స్ నివేదించిన సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఆదాయపు పన్ను చట్టం 1961, ఆడిట్ ఆసేస్మెంట్ 2021-22 వివిధ నివేదికలను, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సి‌బి‌డి‌టి) 2021-22 అసెస్‌మెంట్ ఇయర్  ఆదాయపు పన్ను రిటర్నులు, వివిధ ఆడిట్ నివేదికల దాఖలు గడువు తేదీలను మరింత పొడిగించాలని నిర్ణయించింది "అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఇంతకుముందు సెప్టెంబర్ 30 చివరి తేదీగా నిర్ణయించింది కానీ ఇప్పుడు ఆ తేదీని డిసెంబర్ 31కి మార్చింది.
 

24

సి‌బి‌డి‌టి ఆదాయపు పన్ను రిటర్నుల కోసం చివరి తేదీని పొడిగించడం  రెండవ సారి. కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌లో ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గడువు పొడిగింపు నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా వందలాది మంది పన్ను చెల్లింపుదారులు రిటర్నులు దాఖలు చేయడం కష్టమవుతోంది. చివరి తేదీని పొడిగించడం వలన పన్ను చెల్లింపుదారులకు ఖాతాలు ఆడిట్ చేయవలసిన అవసరం లేదు. ఇంతకుముందు, కరోనా  రెండవ వేవ్ కారణంగా ఐ‌టి‌ఆర్ ని దాఖలు చేయడానికి చివరి తేదీని 2021 సెప్టెంబర్ 30 వరకు అంటే రెండు నెలలు పొడిగించారు. రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ సాధారణంగా జూలై 31.

34

కంపెనీల కోసం : సి‌బి‌డి‌టి 30 నవంబర్ 2021 నుండి 15 ఫిబ్రవరి 2022 వరకు కంపెనీలకు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి గడువును పొడిగించింది.
 

పన్ను ఆడిట్ నివేదిక: పన్ను ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి 15 జనవరి 2022 నుండి 31 జనవరి 2022 వరకు అలాగే అక్టోబర్ 31 నుండి నవంబర్ 30 వరకు ట్రాన్స్ఫర్ ప్రైసింగ్  సర్టిఫికెట్ దాఖలు చేయడానికి పొడిగించబడింది.

సవరించిన రిటర్న్‌లు: ఆలస్యమైన లేదా సవరించిన రిటర్న్‌లను దాఖలు చేయడానికి చివరి తేదీని మరో రెండు నెలలు  అంటే 31 మార్చి 2022 వరకు పొడిగించారు.
పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ ఏడు రకాల ఫారమ్‌లను సూచించింది. మీరు మీ ఆదాయం ఆధారంగా మీ ఐ‌టి‌ఆర్ ఫారమ్‌ను ఎంచుకోవాలి, లేకపోతే ఆదాయపు పన్ను శాఖ దానిని తిరస్కరిస్తుంది. ఫారమ్ నింపేటప్పుడు ఏదైనా పొరపాటు జరిగితే డిపార్ట్‌మెంట్ మీకు నోటీసు పంపవచ్చు.

44
రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

పన్ను చెల్లింపుదారులు రిటర్న్ దాఖలు చేయడానికి సరైన ఐటిఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడం, అందులో అవసరమైన మొత్తం సమాచారాన్ని ఇవ్వడం ముఖ్యం. మీకు జీతం, హౌస్ ప్రాపర్టీ, మూలధన లాభాలు, వ్యాపారం లేదా వృత్తి లేదా వడ్డీ-డివిడెండ్ వంటి ఇతర వనరుల నుండి ఆదాయం ఉంటే రిటర్న్ దాఖలు చేసేటప్పుడు వీటికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇవ్వండి. అన్ని బ్యాంక్ ఖాతాలను కూడా బహిర్గతం చేయండి. దీని కింద ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్, బ్యాంక్ పేరు, ఖాతా నంబర్ గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. రీఫండ్ అప్‌డేట్ చేసిన బ్యాంక్ ఖాతాకు మాత్రమే క్రెడిట్ చేయబడుతుంది కనుక ఇది అవసరం.

click me!

Recommended Stories