హోండా అమేజ్ vs టాటా టిగోర్: ఈ రెండు కార్లలో ఏది బెస్ట్?

Amaze vs Tigor: హోండా అమేజ్, టాటా టిగోర్ ఈ రెండు కార్లు ఇండియాలో పాపులర్ సబ్ కాంపాక్ట్ సెడాన్లు. కాని వాటి ఫీచర్లు, మైలేజ్, ధరల్లో కొన్ని తేడాలున్నాయి. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ కారో ఇప్పుడు తెలుసుకుందాం. 

Amaze vs Tigor: Choosing the Best Compact Sedan in telugu sns

ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో చాలా మంచి సబ్-కాంపాక్ట్ సెడాన్ ఆప్షన్లు ఉన్నాయి. హోండా అమేజ్, టాటా టిగోర్ వాటి ఫీచర్ల వల్ల ఎప్పుడూ బెస్ట్ గానే ఉంటాయి. హోండా అమేజ్, టాటా టిగోర్ మధ్య పోలికను పరిశీలిస్తే, ఈ రెండు కార్లలో కొన్ని కామన్ ఫీచర్లు, కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఈ రెండు కార్ల మైలేజ్, ధరల వివరాలు తెలుసుకుందాం రండి. 

Amaze vs Tigor: Choosing the Best Compact Sedan in telugu sns

హోండా అమేజ్, టాటా టిగోర్ లో కామన్ ఫీచర్లు:

సేఫ్టీ: హోండా అమేజ్, టాటా టిగోర్ రెండు కార్లలోనూ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి ప్రామాణిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

కంఫర్ట్: ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి సౌకర్యాలు రెండు కార్లలోనూ అందుబాటులో ఉన్నాయి.


హోండా అమేజ్, టాటా టిగోర్ లో ప్రత్యేక ఫీచర్లు:

హోండా అమేజ్:

ADAS సిస్టమ్: 2025 హోండా అమేజ్‌లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఉంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్, లేన్ కీపింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

ఇంజిన్ పనితీరు: 1.2-లీటర్ నాలుగు సిలిండర్లతో పనిచేసే హోండా అమేజ్ కారు పెట్రోల్ ఇంజిన్ 88 బిహెచ్‌పి పవర్, 110 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

టాటా టిగోర్:

సిఎన్జి ఆప్షన్: పెట్రోల్‌తో పాటు సిఎన్జి వేరియంట్‌లో కూడా టిగోర్ లభిస్తుంది. ఇది ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది.

భద్రతా రేటింగ్: గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ పొందింది. ఇది భద్రత పరంగా నమ్మకమైన కారు. 
 

మైలేజ్ లో ఏది బెస్ట్

హోండా అమేజ్: మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 18.65 kmpl, సీవీటీ వేరియంట్‌తో 19.46 kmpl మైలేజ్ అందిస్తుంది. 

టాటా టిగోర్: పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ సుమారుగా 19 kmpl మైలేజ్ అందిస్తుంది. సిఎన్జి వేరియంట్‌లో ఇది మరింత పెరుగుతుంది.

ధరలు (ఎక్స్-షోరూమ్):

హోండా అమేజ్ ప్రస్తుతం మార్కెట్ లో రూ. 8 లక్షల నుండి రూ. 10.90 లక్షల వరకు ధర ఉంది. 

టాటా టిగోర్ మాత్రం రూ. 6 లక్షల నుండి రూ. 7.80 లక్షల వరకు ధర ఉంది. 

మీ అవసరాలు, బడ్జెట్ ఆధారంగా ఈ రెండు కార్లలో ఎంపిక చేసుకోవచ్చు. అధునాతన సేఫ్టీ ఫీచర్లు, స్మూత్ పెట్రోల్ ఇంజిన్ కోరుకుంటే హోండా అమేజ్ సరైన ఎంపిక. ఇంధన సామర్థ్యంపై దృష్టి పెట్టి, సిఎన్జి ఆప్షన్, మెరుగైన భద్రతా రేటింగ్ కోరుకుంటే టాటా టిగోర్ బెస్ట్ ఆప్షన్. 

Latest Videos

vuukle one pixel image
click me!