క్రికెట్లోనే కాదు పెట్టుబడిలో కూడా మనోడు రారాజు ! కాఫి నుండి బ్రాండ్ అంబాసిడర్ దాక..

First Published | Dec 2, 2023, 5:37 PM IST

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పరుగులు చేయడంలోనే కాదు వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడంలోనూ రారాజు. ఎన్నో వెంచర్లలో పెట్టుబడి పెట్టిన విరాట్ కోహ్లి టాప్ 7 పెట్టుబడులు ఇక్కడ ఉన్నాయి...
 

ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన మొబైల్ ప్రీమియర్ లీగ్‌ విరాట్ కోహ్లీతో 10 సంవత్సరాల ఒప్పందాన్ని  కుదుర్చుకుంది. MPL అనేది  Galactus Funware Technology Limited కంపెనీకి చెందినది, దీనిలో విరాట్ కోహ్లీ పెట్టుబడి పెట్టారు.
 

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ 2020లో డిజిటల్ ఇన్సూరెన్స్ కంపెనీ digitలో 2.2 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. ఈ స్టార్టప్ కంపెనీని కెనడియన్ బిలియనీర్ ప్రేమ్ వత్స స్థాపించారు.
 

Latest Videos


ఎర్లింగ్ హాలండ్, జా మోరాంట్, నవోమి ఒసాకా, రికీ ఫ్లవర్ తర్వాత విరాట్ కోహ్లీ వెల్నెస్ బ్రాండ్ హైపెరిస్‌లో పెట్టుబడి పెట్టాడు. 2021లో ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా విరాట్ కోహ్లీని ప్రకటించింది.
 

Universal Sportsbiz Pvt Ltd అనేది సచిన్ టెండూల్కర్ సపోర్ట్ ఉన్న సంస్థ. 2020లో, విరాట్ కోహ్లీ ఫ్యాషన్ స్టార్టప్ అయిన ఈ కంపెనీపై 19.3 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాడు.
 

విరాట్ కోహ్లి, అనుష్క శర్మ ఇప్పటికే భారతీయ మొక్కల ఆధారిత మీట్  స్టార్టప్ బ్లూ ట్రైబ్‌లో కూడా భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు.
 

2015లో, విరాట్ కోహ్లి చెసిల్ ఫిట్‌నెస్ & కార్నర్‌ స్టోన్ స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టాడు. చెసిల్ ఫిట్‌నెస్ దేశవ్యాప్తంగా జిమ్ సర్కిల్‌ను నిర్మిస్తోంది.
 

2022లో, విరాట్ కోహ్లీ రేజ్ కాఫీ కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. ఈ కంపెనీ  ఢిల్లీ ఆధారిత FMCG బ్రాండ్. 2018లో స్థాపించబడిన ఈ కంపెనీకి నేడు దేశవ్యాప్తంగా 2500 కంటే ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి.
 

click me!