ఇందులో రెండు వేల రూపాయల 8798 నకిలీ నోట్లు పట్టుబడ్డాయి వీటి విలువ మొత్తం - 1,75,96000 రూపాయలు. నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో మీకు చాలా విషయాలను తెలిసే ఉంటాయి, కానీ మీకు తెలియని నోటుకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. వీటి సహాయంతో మీరు నోటు నిజమైనదా లేదా నకిలీదా అని చిటికెలో తెలుసుకోవచ్చు...
*నోటు విలువ నోటు ఎడమ వైపున దేవనాగరిలో వ్రాసి ఉంటుంది*నోట్ మధ్యలో మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది.*ఆర్‌బిఐ జారీ చేసిన నోట్లపై సెక్యూరిటీ థ్రెడ్‌లో - భారత్ 2000 ఆర్‌బిఐ - అనే మూడు పదాలు ఉంటాయి. నోట్ వంగి ఉన్నప్పుడు భద్రతా థ్రెడ్ రంగు ఆకుపచ్చ నుండి నీలం రంగులోకి మారుతుంది.*మహాత్మా గాంధీ సిరీస్ కొత్త నోట్ పై ఆర్‌బిఐ గవర్నర్ సంతకం ఉంటుంది.*నోట్ల పై ఒక నంబర్ ప్యానెల్ ఉంటుంది దీనిలో నంబర్లు చిన్న నుండి పెద్ద వరకు వ్రాసి ఉంటుంది*ఆర్‌బిఐ జారీ చేసిన నోట్లకు నిర్ణీత సైజ్ ఉంటుంది. 2000 రూపాయల నోటు సైజ్ 66×166 ఎంఎం.*నోట్ కుడి వైపున అశోక పిల్లర్, వాటర్‌మార్క్ కూడా ఉంటుంది.*నోటు ముద్రించిన సంవత్సరం నోట్ వెనుక వైపు వ్రాసి ఉంటుంది
దృష్టి లోపం ఉన్నవారు ఎలా గుర్తించాలంటే ?*దృష్టి లోపం ఉన్నవారు కూడా నోట్లను గుర్తించవచ్చు. నోట్ ముందు భాగంలో ఎడమ ఇంకా కుడి వైపులా ఏడు గీతాలు ఉంటాయి.*నోట్ విలువ దీర్ఘచతురస్రాకారంలో పెద్ద అక్షరాలతో ఉంటుంది.*మహాత్మా గాంధీ బొమ్మ, అక్షరాలతో వ్రాసిన నోటు విలువ నోటుపై ముద్రించి ఉంటుంది.దీనితో పాటు అశోక పిల్లర్ ఆకారం కూడా నోట్లో పై ఉంటుంది.*మీరు నకిలీ నోటును గుర్తించడంలో ఏదైనా సమస్యను ఉంటే https:paisaboltahai.rbi.org.in వెబ్‌సైట్‌లో ఫోటో, గ్రాఫిక్‌లతో కొత్త నోట్ పూర్తి వివరాలను మీరు అర్థం చేసుకోవచ్చు. అన్ని నోట్లకు సంబంధించి పూర్తి సమాచారం ఈ వెబ్‌సైట్‌లో లభిస్తుంది.