ఫుడ్ డెలివరీ బాయ్ గా ఉబెర్ సి‌ఈ‌ఓ.. ఒక్క రోజలో ఎంత సంపాదించాడో తెలుసా ?

Ashok Kumar   | Asianet News
Published : Jun 28, 2021, 01:06 PM IST

 ఒక సంస్థ  సి‌ఈ‌ఓ మీరు ఊహించని పని చేయడం ఎప్పుడైనా చూశారా.. ? ఉబెర్ సీఈఓ దారా ఖోస్రోషాహి ఇలాంటిదే చేసారు.. అవును.. నిజమే.. ఫుడ్ డెలివరీ అనుభవాన్ని పొందడానికి దారా ఖోస్రోషాహి స్వయంగా ఫుడ్ ఆర్డర్లను  డెలివరీ చేశాడు. అతను ఒక రోజులో మొత్తం 98.91 డాలర్లను సంపాదించినట్లు తెలిపారు.  

PREV
16
ఫుడ్ డెలివరీ బాయ్ గా ఉబెర్ సి‌ఈ‌ఓ.. ఒక్క రోజలో  ఎంత సంపాదించాడో తెలుసా ?

దారా ఖోస్రోషాహి  ట్విట్టర్ ద్వారా ఈ సమాచారం అందించారు. తన ఫుడ్ డెలివేరి అనుభవాన్ని పంచుకుంటూ ట్విట్టర్ లో "ఉబెర్ ఈట్స్ కోసం కొన్ని గంటలు ఫుడ్ డెలివేరి చేశాను. 1. శాన్ ఫ్రాన్సిస్కో నిజానికి ఒక అందమైన పట్టణం. 2. రెస్టారెంట్ సిబ్బంది చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. 3. ఇప్పుడు బిజీ !  ఆన్‌లైన్‌లో 3:30 నాటికి డెలివేరి చేయాలి. 4. నేను ఆకలితో ఉన్నాను - ఏదైనా ఆర్డర్ చేసే సమయం వచ్చింది. " అంటూ పోస్ట్ చేశారు.
 
26

ఈ ట్వీట్‌లో దారా రెండు ఫోటోలను కూడా షేర్ చేశారు, అందులో అతను హెల్మెట్ ధరించి, యుబర్ ఈట్స్ బ్యాగ్‌ను తన వెనుక భాగంలో ధరించి కనిపిస్తాడు. మరోవైపు, అతని సంపాదన గురించి ఒక ఫోటో స్క్రీన్ శాట్ షేర్ చేశాడు. అతను మొత్తం 98.91 (సుమారు రూ. 7338) డాలర్లు సంపాదించానని, 10 ట్రిప్పులు పూర్తి చేశానని పోస్ట్ లో తెలిపారు. దీంతో ఆయనకు 45 పాయింట్లు వచ్చాయి.
 
36

రెండవ రోజు 
ట్విట్టర్ హ్యాండిల్‌లో దారా ఖోస్రోషాహి రెండవ రోజు డెలివరీ గురించి కూడా తన అనుభవాన్ని పంచుకున్నాడు.  ట్విట్టర్ లో "డే 2- మొదటి రోజులాగా లేదు. ఎక్కువ ట్రాఫిక్,  తక్కువ టిప్స్, ఫాస్ట్ డెలివేరి.  @SFGiantsFans నన్ను చంపడానికి ప్రయత్నించాడు. నేను మెట్స్ అభిమానినని అతనికి తెలుసు. ఇప్పుడు చాలా సూపర్ బిజీ - 2:02 నుండి ఆన్‌లైన్‌లో  మొదటిసారి డార్క్ స్టోర్ నుండి ఆర్డర్ తీసుకున్నాను. " అంటూ పోస్ట్ చేశారు.
 
46

ఈ ట్వీట్‌తో పాటు, అతను మరో రెండు ఫోటోలను షేర్ చేశారు, అందులో ఒకటి తన రోజు సంపాదన వివరాల ఫోటో  ఉంది. ఇందులో దారా ఖోస్రోషాహి మొత్తం. 50.63 (సుమారు రూ. 3756) సంపాదించారు అలాగే మొత్తం 6 ట్రిప్పులను పూర్తి చేశారు. దీంతో ఆయనకు మొత్తం 18 పాయింట్లు వచ్చాయి.

56

అలాగే అతను చేసిన పనికి కాస్త నెగెటివిటీ కామెంట్స్ కూడా వచ్చాయి. కొందరు పబ్లిసిటీ స్టంట్‌ అదిరిందంటూ ఖోస్రోషాహిని హేళన చేశారు. ఇంకొందరు ఉబెర్‌ ఈట్స్‌ సర్వీసును పొగుడుతూనే  డెలివేరి వర్కర్లను మనుషుల్లా చూడడం నేర్పండంటూ  చురకలంటించారు.

66
click me!

Recommended Stories