Copper Price: బంగారం కొనే స్థోమ‌త లేదా.? రాగి కొనిపెట్టుకోండి. అసలు కారణం తెలిస్తే..

Published : Oct 06, 2025, 05:54 PM IST

Copper Price: బంగారం పేరు వింటేనే భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో చాలా మంది బంగారం కొనేందుకు ద‌డుసుకుంటున్నారు. అయితే రానున్న రోజుల్లో రాగి ధ‌ర‌లు కూడా ఓ రేంజ్‌లో పెరుగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు. దీనికి కార‌ణాలు ఏంటంటే.? 

PREV
15
రికార్డు స్థాయిలో కాపర్ ధరలు

2025లో కాపర్ ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగాయి. భారతదేశంలో ఎంసిఎక్స్ (MCX)లో కాపర్ ఫ్యూచర్స్ కిలోకు రూ. 976.50 చేరగా, ఇది ఈ ఏడాది ఇప్పటివరకు 20% కంటే ఎక్కువ పెరుగుదల క‌నిపించింది. లండన్ మెటల్ ఎక్స్చేంజ్ (LME)లో టన్నుకు $10,000 దగ్గర, షాంఘై ఎక్స్చేంజ్ (SHFE)లో కూడా 8% పెరుగుదల నమోదైంది.

25
ధరల పెరుగుదల వెనుక ప్రధాన కారణాలు

కాపర్ డిమాండ్ పెరగడానికి, ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి:

పెరుగుతోన్న కాప‌ర్ అవ‌స‌రం: ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), సౌర, గాలి శక్తి ప్రాజెక్టులకు కాపర్ అవసరం. ఒక EVలో సాధారణ వాహనంతో పోలిస్తే 2–4 రెట్లు ఎక్కువ కాపర్ వాడతారు.

సరఫరా ఆటంకాలు: ఇండోనేషియాలోని గ్రాస్‌బర్గ్ మైన్ వంటి గనుల్లో సమస్యలు రావడంతో ఉత్పత్తి తగ్గింది. కొత్త గనులు ప్రారంభం కావడానికి 15 ఏళ్లకు పైగా సమయం ప‌ట్టే అవ‌కాశం ఉంది.

టారిఫ్ షాక్స్: అమెరికా ప్రభుత్వం 50% టారిఫ్ విధించడం వల్ల గ్లోబల్ ట్రేడ్ ఫ్లోస్ దెబ్బతిన్నాయి.

చైనా ప్రోత్సాహం: చైనా భారీగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు చేయడం వల్ల కాపర్ వినియోగం పెరిగింది.

35
సరఫరా డిమాండ్‌లో అసమానత

ఇంట‌ర్నేష‌న‌ల్ కాప‌ర్ స్ట‌డీ గ్రూప్ (ICSG) అంచనా ప్రకారం, 2025లో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ సరఫరాను మించిపోతుంది. ఆసియా 74% కాపర్ వినియోగం చేస్తోంది, ఇందులో భారత్, చైనా ముందంజలో ఉన్నాయి. ఇక చిలీ, పెరూ వంటి ప్రధాన ఉత్పత్తిదారులు పర్యావరణ, కార్మిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాగి నిల్వలు కూడా గత ఏడాదితో పోలిస్తే 66% తగ్గిపోయాయి.

45
జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, వాణిజ్య విధానాలు

అమెరికా–చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, లాటిన్ అమెరికా, యూరప్ నుంచి వచ్చే దిగుమతులపై కొత్త టారిఫ్‌లు కాపర్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. మధ్యప్రాచ్య యుద్ధాలు, ఇంధన ధరల పెరుగుదల గనుల నిర్వహణ ఖర్చులను పెంచుతున్నాయి. దీని వల్ల కాపర్ ధరల్లో రిస్క్ ప్రీమియం మరింత పెరిగింది.

55
అమెరికా ఫెడ్ విధానం

అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశమున్నందున డాలర్ బలహీనమవుతోంది. డాలర్ బలహీనమైతే కాపర్ వంటి డాలర్‌లో ట్రేడ్ అయ్యే లోహాలు ఇతర దేశాల కొనుగోలుదారులకు చౌకగా మారతాయి. ఇది డిమాండ్‌ను మరింత పెంచుతుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ ఎన‌ర్జీ ఏజెన్సీ (IEA) అంచనా ప్రకారం, 2035 నాటికి 30% సరఫరా లోటు ఏర్పడుతుంది. AI ఆధారిత డేటా సెంటర్లు, EVలు, స్మార్ట్ గ్రిడ్లు కాపర్ వినియోగాన్ని భారీగా పెంచుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories