డిసెంబర్ లో 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి
డిసెంబర్ 2022లో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవలు ఉన్నాయి. రెండవ, నాల్గవ శనివారాలు, 4 ఆదివారాలు సహా 13 రోజుల సెలవులు ఉన్నాయి. డిసెంబర్ క్రిస్మస్, సంవత్సరంలో చివరి రోజు గురు గోవింద్ సింగ్ పుట్టినరోజు సందర్బంగా బ్యాంకులకు సెలవు. భారతదేశంలోని అన్ని రకాల బ్యాంకులు ప్రభుత్వ సెలవు దినాలలో ఎప్పుడూ మూసివేయబడతాయి. ఇది కాకుండా, స్థానిక పండుగల సమయంలో కూడా కొన్ని బ్యాంకులు మూసివేయబడతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు మీ బ్యాంకింగ్ సంబంధిత పనులను పూర్తి చేయాలి లేదా మీరు ఆన్‌లైన్ సౌకర్యాన్ని ఉపయోగించవచ్చు.