బిజినెస్ ఐడియా: ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని ఫుడ్ బిజినెస్ ఇదే, సిటీలో ఫుల్ డిమాండ్ ఉండే చాన్స్..

First Published Nov 23, 2022, 11:31 PM IST

నిరుద్యోగ యువత కూడా  ముద్ర రుణాలను తీసుకొని వ్యాపారాల్లో సెటిల్ అవుతున్నారు. మీరు కూడా ముద్ర రుణాల ద్వారా వ్యాపారం ప్రారంభించాలని అని అనుకుంటున్నారా.  అయితే ఏం చేయాలో తెలుసుకుందాం

Saving Tips- Housewives should follow these tips to save money

బిజినెస్ చేయాలని అనుకుంటున్నారా అయితే పెట్టుబడి దొరకక వెనకడుగు వేస్తున్నారు ఇక ఏ మాత్రం చింతించవద్దు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ముద్ర లోన్స్ పథకాన్ని ప్రారంభించింది. ఈ రుణాల ద్వారా చిన్న మధ్య తరహా వ్యాపారులకు ఆర్థిక సాయం లభిస్తోంది.

 ఫుడ్ బిజినెస్ విషయానికి వస్తే ఎప్పటికీ డిమాండ్ తగ్గలేదు అని చెప్పాలి. కరోనా సమయంలో కూడా  ఫుడ్ బిజినెస్ చాలా బాగా అయింది.  ముఖ్యంగా ఫుడ్ డెలివరీ యాప్స్  పుణ్యమా అని చాలా మంది వ్యాపారులు ఫుడ్ బిజినెస్ లో చాలా బాగా రాణించారు.అయితే  ఫుడ్ బిజినెస్ అనగానే మన ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి.  అయితే వినూత్నంగా ఆలోచించిన వారికే ఈ బిజినెస్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది.

 ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బొంగు చికెన్ గురించి అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వెదురు బొంగులో చికెన్ ఇతర మసాలాలను  చొప్పించి, ఆ వెదురు బొంగులను  సన్నటి సెగపై కాల్చుతారు.  వెదురు బొంగు లోపల ఉన్ని చికెన్ సమంగా ఉడికి, చక్కటి రుచి వస్తుంది.  వెదురు బొంగులో చికెన్ తినేందుకు విదేశీయులు కూడా ఇష్టపడుతుంటారు. అంతేకాదు పట్టణ ప్రాంతాల్లో సైతం యువత ఈ బొంగులో చికెన్ తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీని వ్యాపార అవకాశంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. 
 

ఈ వెదురు బొంగు చికెన్ వ్యాపారం కోసం మీకు కావాల్సింది ముందుగా ఒక ఫుడ్ స్టాల్,  లేదా ఒక షాపు అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెదురు బొంగుల కోసం గిరిజనుల నుంచి సేకరించాల్సి ఉంటుంది.  తెలంగాణలో అయితే ఖమ్మం జిల్లా అలాగే  గిరిజన ప్రాంతాల్లో వెదురు పొదలు అధికంగా ఉంటాయి.  గిరిజనులు అటవీ ఉత్పత్తులను సేకరణలో భాగంగా వెదురుబొంగులను సేకరిస్తుంటారు.  వారి వద్ద నుంచి వెదురు బొంగులను సేకరించి ప్రతిసారీ ట్రాన్స్ పోర్ట్ ద్వారా మీ ప్రదేశానికి తెప్పించుకోవాల్సి ఉంటుంది. 

bamboo chicken

  వెదురు బొంగు చికెన్ తయారు చేసేందుకు,  వంట తయారీ తెలిసిన మనిషిని  పెట్టుకుంటే మంచిది.  ఒకవేళ మీరే స్వయంగా చికెన్ తయారు చేయాలి అనుకుంటే,  కొంతకాలం పాటు వెదురు బొంగు చికెన్ తయారు చేసే వారి వద్ద శిక్షణ పొందితే మంచిది. అప్పుడే కస్టమర్లు కోరిన రుచిని మీరు అందించగలరు. 

ఇక బొంగులో చికెన్ కోసం ఆర్డర్లు పొందాలంటే ఫుడ్ డెలివరీ యాప్స్ తో కూడా టైఅప్  అయితే మంచిది.  అప్పుడే మీకు లాభం వస్తుంది. ఇంకా నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగించడం ద్వారానే చక్కటి రుచి వస్తుంది. అప్పుడే మీ వద్దకు  కస్టమర్లు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది.    
 

click me!