మీకు తక్కువ ధరకు బంగారం కావాలా? అయితే ఆ రాష్ట్రం వెళ్లాల్సిందే

First Published | Dec 4, 2024, 9:10 PM IST

ప్రపంచవ్యాప్తంగా బంగారం ఎక్కువగా వాడే దేశాలు చాలా ఉన్నాయి. అక్కడ ధరలు కూడా తరచూ మారుతూ ఉంటాయి. భారతదేశం కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. అయితే ఇతర ప్రాంతాలతో పోలిస్తే మన దేశంలో ఒక రాష్ట్రంలో బంగారం చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఆ రాష్ట్రంలోనే బంగారం ధర ఎందుకు తక్కువకు దొరుకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

భారతదేశంలో ఆ రాష్ట్రంలో బంగారం ధర ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి పోర్టులు ఎక్కువగా ఉండటం, దేశంలోనే పెద్దవి ఆ రాష్ట్రంలో ఉండటం. వీటి వల్ల రవాణా ఖర్చులు తక్కువగా ఉంటాయి. అందువల్లనే ఆ రాష్ట్రంలో ఎక్కువగా బంగారం ఉపయోగిస్తారు. దేశవ్యాప్తంగా చాలా మంది వ్యాపారులు కూడా నేరుగా ఆ రాష్ట్రం వెళ్లి భారీ మొత్తంలో బంగారం కొని తెచ్చుకుంటారు. 

ఆ రాష్ట్రం మరేదో కాదు. దక్షిణ భారత దేశంలో వెస్ట్ సైడ్ చివర ఉన్న కేరళ రాష్ట్రం. ఇండియాలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో బంగారం ధర తక్కువగా ఉంటుంది. ఈ ధరల్లో తేడాలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయి. ప్రధానంగా చిన్న, పెద్ద పోర్టులు ఎక్కువగా ఉండటం ఒకటైతే, కేరళలో రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు తక్కువగా ఉంటడం మరో ముఖ్య కారణం. దీనివల్ల బంగారం ధర తగ్గుతుంది.


మరో ముఖ్య విషయం ఏంటంటే.. కేరళలోని కొంతమంది వ్యాపారులు GST నిబంధనలను తప్పించుకుంటున్నారని, అందువల్ల తక్కువ ధరకు బంగారాన్ని ఇచ్చేందుకు సహాయపడుతున్నారని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇది ఫైనాన్షియల్ క్రైం అయినప్పటికీ ఆ రాష్ట్రంలో చాపకింద నీరులా ఈ వ్యవహారం సాగిపోతోంది. అందువల్లనే కేరళ రాష్ట్రంలో తక్కువ రేటుకు బంగారం దొరుకుతోంది. 

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం సంవత్సరానికి 200 నుంచి 225 టన్నుల వినియోగంతో కేరళలో భారతదేశంలో తలసరి బంగారం వినియోగం అత్యధికంగా ఉంది. ఈ గణనీయమైన డిమాండ్ ధరల డైనమిక్స్‌ను కూడా ప్రభావితం చేస్తుంది. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాలు కూడా బంగారం ఎక్కువగా వాడే రాష్ట్రాల్లో ముందున్నాయి. 

కానీ కేరళలో ఎక్కువగా బంగారం వినియోగించడానికి, తక్కువ ధరకు మరో ముఖ్యమైన కారణం ఏంటంటే.. కేరళ మార్కెట్ లో ఒరిజినల్ బంగారం ఎక్కువగా లభిస్తుంది. అందువల్ల ఆ రాష్ట్రంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో నగల ధరించడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఇది ఆ రాష్ట్ర తలసరి ఆదాయం, వినియోగంపై స్పష్టంగా కనిపిస్తుంది. వివాహాలు, పండుగలు, సాంప్రదాయ ఆచారాల కోసం అక్కడ ప్రజలు అధికంగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. 

Latest Videos

click me!