ChatGPT-4.5 Update: చాట్ జీపీటీ-4.5 అప్‌డేట్ వచ్చేసింది! ఫీచర్స్ తెలిస్తే ఆశ్యర్యపోతారు

Published : Mar 15, 2025, 05:51 PM IST

ChatGPT-4.5 Update: చాట్ జీపీటీ నుంచి కొత్త అప్ డేట్ వచ్చింది. ఇదేదో సింపుల్ అప్ డేట్ అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే చాట్ జీపీటీ-4.5 ఫ్యూచన్ ని మార్చే సూపర్ పవర్ ని కలిగి ఉంది. ఇంతకు ముందు కంటే కచ్చితమైన సమాచారాన్ని ఇచ్చేలా అప్ డేట్ అయింది.   

PREV
14
ChatGPT-4.5 Update: చాట్ జీపీటీ-4.5 అప్‌డేట్ వచ్చేసింది! ఫీచర్స్ తెలిస్తే ఆశ్యర్యపోతారు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డెవలప్‌మెంట్‌లో OpenAI నుంచి ChatGPT-4.5 రావడం ఒక కొత్త మైలు రాయి. AI ఇప్పుడు చాలా రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు, ఎకనామిక్ గ్రోత్‌కి ఉపయోగపడే శక్తిగా మారింది.

ChatGPT-4.5 మునుపెన్నడూ లేని డెవలప్‌మెంట్‌కి, సమస్యల్ని పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందువల్ల హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ లాంటి ఇండస్ట్రీస్ చాలా మార్పులకు గురవబోతున్నాయి. ChatGPT-4.5లోని మరికొన్ని ప్రత్యేకతలను తెలుసుకుందాం. 

24

ChatGPT-4.5 అంటే ఏంటి?

ఇది Open AI జనరేటివ్ AI సిరీస్‌లో లేటెస్ట్ మోడల్. ఇది పాత మోడల్స్‌ని ఇంప్రూవ్ చేయగా వచ్చిన లేటెస్ట్ వెర్షన్. ఇందులో నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇంప్రూవ్ చేసిన కాంటెక్స్ట్ అండర్‌స్టాండింగ్, అచ్చు మనిషి లాంటి సమాధానాలు ఇచ్చే కెపాసిటీని కూడా కలిగి ఉంది. పాత వెర్షన్స్ కోడింగ్, డేటా అనాలిసిస్, క్రియేటివ్ రైటింగ్ లాంటి కష్టమైన పనుల్ని కూడా హ్యాండిల్ చేయగలదు. ఈ కొత్త మోడల్ ఎలాంటి ప్రశ్నలకైనా కచ్చితమైన సమాధానాలు ఇవ్వడంలో బెస్ట్. అడ్వాన్స్‌డ్ అల్గారిథమ్స్‌తో ChatGPT-4.5  డేటా సెట్స్ నుంచి ప్రతి విషయాన్ని ఎఫెక్టివ్‌గా నేర్చుకోగలదు. 

34

ChatGPT-4.5 ఎకనామిక్ ఇంపాక్ట్

సొసైటీలోని అనేక సెక్టార్లపై చాట్ జీపీటీ-4.5, జనరేటివ్ AI ఇంపాక్ట్ ఇప్పటికే చాలా ఉంది. పనుల్ని ఆటోమేట్ చేయడం, ఎఫిషియెన్సీని పెంచడం ద్వారా బిజినెస్‌ ఆపరేషన్స్ చాలా సులభం చేసేసింది. 2030 నాటికి AI వరల్డ్ ఎకానమీకి $13 ట్రిలియన్ వరకు కాంట్రిబ్యూట్ చేస్తుందని అంచనా. ఈ విషయంలో Chat GPT-4.5 కంపెనీలు కొత్తగా ఏదైనా చేయడానికి, కొత్త మార్కెట్ లోకి ఎంటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. AI డెవలప్‌మెంట్, డేటా సైన్స్ లాంటి ఫీల్డ్స్‌లో జాబ్స్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా, ఈ టూల్స్ చిన్న బిజినెస్‌లు, స్టార్టప్‌లు పెద్ద కంపెనీలతో పోటీ పడటానికి హెల్ప్ చేస్తాయి. 

44

సవాళ్లు, నైతిక విషయాలు

చాట్ జీపీటీ-4.5 చాలా బెనిఫిట్స్ ఇస్తుందనడంలో డౌట్ లేదు. కానీ ఇది డేటా ప్రైవసీ, అల్గారిథమిక్ బయాస్, జాబ్ లేకుండా చేసే అంశాలపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదకరంగానూ  మారే అవకాశం ఉంది. పాలసీ మేకర్స్, కంపెనీలు, టెక్నాలజీ కమ్యూనిటీ ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories