APPLE iPhone కేవలం రూ.1231 కొనుగోలు చేసే చాన్స్...ఎలాగో పూర్తి వివరాలు తెలుసుకోండి..

First Published | Sep 25, 2022, 1:37 PM IST

ఆపిల్ ఐఫోన్ కొనుగోలు చేయడమే మీ లక్ష్యమా, అయితే ఈ దసరా సందర్భంగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సేల్ లో అతి తక్కువ ధరకే ఆపిల్ ఫోన్ కొనుగోలు చేసే వీలు దొరుకుతుంది. ఇందు కోసం మీరు ప్రతి నెల కేవలం 1200 రూపాయలు చెల్లిస్తే చాలు ఈ ఆఫర్ ఎలా ఉందో తెలుసుకుందాం.

మార్కెట్ లో ఎన్ని ఫలాలు ఉన్నప్పటికీ ఐఫోన్ కొనడం అనేది ఒక కళ అనే చెప్పాలి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఐఫోన్ ఆపిల్ కంపెనీ తయారు చేసే ఈ ఫోన్లో కొనుగోలు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ ఫోన్ ఇంతలా పాపులర్ కావడానికి ప్రధాన కారణం ఇందులోని స్పెసిఫికేషన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐఫోన్ లో హ్యాకింగ్ చేయడం చాలా కష్టమైన పని ఇందులోని   యాప్స్ సైతం ఆపిల్ తయారుచేసే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
 

ఐఫోన్ లో ధర విషయానికి వస్తే ఇతర ఫోన్ లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే చాలా మంది ఐఫోన్ కొనుగోలు చేసేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అయితే  తాజాగా విడుదలైన ఐఫోన్ 14 ధర విషయానికి వస్తే దీని గరిష్ట ధర దాదాపు ఒక లక్షా 25 వేలు పలుకుతోంది.  
 


APPLE iPhone 11 (Black, 64 GB) ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం 18 శాతం డిస్కౌంట్ తో కేవలం రూ.35,990కే లభిస్తోంది.దీని అసలు ధర రూ.43,900 పలుకుతోంది. ఇదిలా ఉంటే ఈ ఫోన్ 64 GB ROM సామర్థ్యంతో పనిచేస్తుంది. 15.49 సెం.మీ (6.1 అంగుళాల) లిక్విడ్ రెటీనా HD డిస్ ప్లే ఇందులోఅందుబాటులో ఉంది.  iOS 14.2 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే 12MP + 12MP  బ్యాక్ కెమెరా, 12MP Front Camera తో వస్తోంది. 194 గ్రాముల బరువుతో ఈ ఫోన్ లభిస్తోంది. 
 

ఫోన్‌కు పవర్ అందించడానికి, 3110mAh నాన్-రిమూవబుల్ బ్యాటరీ అందుబాటులో ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని కారణంగా మీరు ఐఫోన్ 11ని మళ్లీ మళ్లీ ఛార్జ్ చేయనవసరం లేదు. ఒకే పూర్తి ఛార్జ్‌లో ఎక్కువ బ్యాటరీ జీవితాన్ని పొందవచ్చు.
 

iPhone 11లో కనెక్టివిటీ కోసం, Wi-Fi 802.11 a / b / g / n / ac / 6, డ్యూయల్-బ్యాండ్, హాట్‌స్పాట్, NFC, GPS, A-GPS, GLONASS, గెలీలియో, బ్లూటూత్, USB 2.0 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బేరోమీటర్, ఫేస్ ఐడి, గైరో, ప్రాక్సిమిటీ సెన్సార్, కంపాస్, యాక్సిలెరోమీటర్, సిరి నేచురల్ లాంగ్వేజ్ కమాండ్‌లు, డిక్టేషన్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉన్నాయి. 
 

ఇక ఆపిల్ ఐఫోన్ 11 కొనుగోలు చేసేందుకు ఫ్లిప్కార్ట్ లో అనేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్, ఐ సి ఐ సి ఐ క్రెడిట్ కార్డులపై 10% discount లభిస్తోంది ఈ డిస్కౌంట్ 1250 రూ వరకు అందుబాటులో ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్, ఐ సి ఐ సి ఐ  డెబిట్ కార్డులపై వెయ్యి రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు 
 

ఆపిల్ ఐఫోన్ 11 స్మార్ట్ఫోన్ను ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అత్యల్పంగా 1,231/month  గా నుంచి ప్రారంభం అవుతోంది. అయితే ఈ ఆఫర్ లో 36 నెలల పాటు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.  అలాగే అన్ని ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డులతో ఈఎంఐ ద్వారా ఈ  స్మార్ట్ కొనుగోలు కొనుగోలు చేయవచ్చు. 
 

Latest Videos

click me!