సీనియర్ సిటిజన్ల కోసం సెంట్రల్ బ్యాంక్ ఒక మంచి స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) స్కీమ్ తీసుకొచ్చింది. మీ ఇంట్లో పెద్దవారు ఉన్నారా? వాళ్ళ డబ్బుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ 777 రోజుల స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) స్కీమ్‌లో 8.05% వడ్డీ లభిస్తుంది.
ఇన్వెస్ట్‌మెంట్ విషయంలో, సీనియర్ సిటిజన్స్ FDలపైనే ఎక్కువగా ఆధారపడతారు. ఈ స్కీమ్‌లో, వాళ్ళ డబ్బుకి నష్టం జరిగే ప్రమాదం లేదు. గ్యారెంటీడ్ రిటర్న్స్ వస్తాయి. మీ ఇంట్లో పెద్దవారు ఉంటే, వాళ్ళ డబ్బుని సెంట్రల్ బ్యాంక్ 777 రోజుల FD స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్‌కి 8.05% వడ్డీ లభిస్తుంది.
25
సెంట్రల్ బ్యాంక్ 777 రోజుల స్పెషల్ FD
ఈ స్కీమ్ పేరు ‘సెంట్ గరిమా టర్మ్ డిపాజిట్ స్కీమ్’. ఈ స్కీమ్ 777 రోజుల మెచ్యూరిటీ పీరియడ్‌తో ఉంటుంది. అంటే రెండు సంవత్సరాల ఒకటిన్నర నెలల్లో ఈ స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. ఇందులో, సాధారణ కస్టమర్లకు 7.55% వడ్డీ ఇస్తారు. సీనియర్ సిటిజన్స్‌కి 0.5% అదనపు వడ్డీ లభిస్తుంది. అంటే పెద్దవారికి 8.05% వడ్డీ వస్తుంది. పెద్దవారు 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే ఎంత లాభం వస్తుందో ఇప్పుడు చూద్దాం.
35
సెంట్రల్ బ్యాంక్ 777 రోజుల స్పెషల్ FD
సీనియర్ సిటిజన్స్ ఈ స్కీమ్‌లో రూ.1,00,000 డిపాజిట్ చేస్తే, 8.05% వడ్డీతో, వాళ్ళకి రూ.18,490 వడ్డీ వస్తుంది. దీని ద్వారా, మెచ్యూరిటీ సమయంలో రూ.1,18,490 వస్తుంది. ఇతర కస్టమర్లకు రూ.1,00,000 డిపాజిట్‌కి 7.55% వడ్డీ ప్రకారం రూ.17,260 వడ్డీ వస్తుంది. ఈ విధంగా, మెచ్యూరిటీ మొత్తం రూ.1,17,260 అవుతుంది.
45
సెంట్రల్ బ్యాంక్ 777 రోజుల స్పెషల్ FD
సెంట్రల్ బ్యాంక్ ఈ స్పెషల్ FD స్కీమ్‌లో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీ డిపాజిట్ మొత్తంలో 90% వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్ మొత్తానికి వడ్డీ రేటు డిపాజిట్ చేసిన మొత్తానికి వచ్చే వడ్డీ కంటే 1.00% ఎక్కువగా ఉంటుంది. డిపాజిట్ మొత్తంపై లోన్ తీసుకుంటే, ముందుగానే డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉండదు.
55
సెంట్రల్ బ్యాంక్ 777 రోజుల స్పెషల్ FD
ఈ స్కీమ్‌ని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే, ఆన్‌లైన్/నెట్ బ్యాంకింగ్/మొబైల్ బ్యాంకింగ్ ద్వారా దీన్ని పొందవచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కి వెళ్లి ఆఫ్‌లైన్‌లో కూడా అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఈ స్కీమ్‌లో కనీసం రూ.10,000 నుండి గరిష్ఠంగా రూ.10,00,00,000 వరకు డిపాజిట్ చేయవచ్చు. మెచ్యూరిటీకి ముందే మీరు డబ్బులు తీసుకుంటే, 1% చొప్పున పెనాల్టీ చెల్లించాలి.