సుజుకి ప్రస్తుతం జపాన్‌లోని కోసాయ్ ప్లాంట్‌లో జిమ్నీ 3-డోర్ వెర్షన్‌ను తయారు చేస్తోంది. 660 సిసి మోటారుతో జిమ్నీ స్టాండర్డ్, 1.5 లీటర్ మోటారుతో జిమ్నీ సియెర్రా అనే రెండు మోడల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. జిమ్నీ 5-డోర్ వెర్షన్ జిమ్నీ సియెర్రాను పోలి ఉంటుంది. కానీ 3-డోర్ మోడల్‌తో పోలిస్తే ఎక్కువ స్పేస్, ప్రాక్టికాలిటీని కలిగి ఉంటుంది.
5-డోర్ జిమ్నీ ఇండియన్ వెర్షన్‌తో జిమ్నీ నోమాడ్ చాలా ఫీచర్లను పంచుకుంటుంది. 103.36 bhp పవర్, 134.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే అదే 1.5 లీటర్ K15B పెట్రోల్ ఇంజిన్ వాహనానికి శక్తినిస్తుంది. ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమేటిక్. అదనంగా సుజుకి ఆల్‌గ్రిప్ 4WD సిస్టమ్‌తో జిమ్నీ నోమాడ్ వస్తుంది. అన్ని వేరియంట్లలో ఆఫ్-రోడ్ సామర్థ్యం ఉంటుంది.