గత కొన్ని సంవత్సరాలుగా స్టీవ్ జాబ్స్ సంతకం ఉన్న వస్తువులు ఎల్లప్పుడూ వేలంలో అధిక ధరను నమోదు చేశాయి. డిసెంబర్ 2019లో అతని సంతకం ఉన్న ఒక ఫ్లాపీ డిస్క్ దాదాపు $ 84,000 (రూ. 60 లక్షలు) కు విక్రయించారు.
2020లో స్టీవ్ జాబ్స్ ఆటోగ్రాఫ్ చేసిన మ్యాగజైన్ కవర్ కూడా వేలంలో 16,000 (రూ. 12 లక్షలు)డాలర్లు పలికింది. మ్యాగజైన్ కవర్ ఫోటో 1989 నుండి ఫార్చ్యూన్ అక్టోబర్ ఎడిషన్, ఇందులో కవర్‌పై స్టీవ్ జాబ్స్ కనిపిస్తారు అలాగే "టు టెర్రీ, స్టీవ్ జాబ్స్" అని రాసి ఉంటుంది.ఈసారి ఆపిల్ మాజీ సిఈఓ చెందిన జ్ఞాపకాలు వేలంలో ఎక్కువ ధరను పలికాయి.