జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ ఈ ధన్‌తేరస్ షాపింగ్ వాతావరణం చాలా బాగుందని అన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 43 శాతం ఎక్కువ అమ్మకాలు జరిగాయి. ధన్‌తేరస్‌లో జరిగిన మొత్తం విక్రయాల్లో వాహనాల వాటా రూ.5,000 కోట్లు అలాగే 3,000 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను విక్రయించారు. రూ.1,000 కోట్ల విలువైన వస్తువులు విక్రయించగా, రూ.300 కోట్ల విలువైన పూజా సామాగ్రి అమ్మకాలు జరిగాయి. దీంతో పాటు లక్ష్మీ-గణపతి విగ్రహాలు, మట్టి దీపాలు, అలంకరణ వస్తువులు, డెకరేటివ్ తోరణాలు, చీపుర్ల విక్రయాలు కూడా గతేడాది కంటే మెరుగ్గా సాగాయి.