Business Ideas: కేవలం రూ. 50 వేలు పెట్టుబడితో నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే వీలున్న బిజినెస్ ఇదే..

First Published Sep 28, 2022, 7:52 PM IST

తక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా, అయితే అనేక వ్యాపార అవకాశాలు మన కళ్ళముందు ఉన్నాయి. ఈ వ్యాపారాలను అతి తక్కువ పెట్టుబడి తో ప్రారంభించి, ప్రతినెల లక్షల సంపాదించుకునే వీలుంది. అలాంటి వ్యాపారం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం అం అటు పట్టణాలు గ్రామాలు అన్నిచోట్ల ఫంక్షన్లలో కేటరింగ్ సర్వీస్ సర్వసాధారణం అయిపోయింది. కేటరింగ్ బిజినెస్ చేయడం ద్వారా మీకు చక్కటి ఆదాయం లభిస్తుంది. అయితే ఈ బిజినెస్ లో మెళకువలు, పెట్టుబడి ఎంత, లాభం ఎంత, సాధకబాధకాలను తెలుసుకుందాం. 

క్యాటరింగ్ వ్యాపారం ప్రారంభించడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. క్యాటరింగ్ వ్యాపారంలో పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది , సంపాదన కూడా బాగుంటుంది. మీరు కేవలం రూ. 50,000లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఈ రోజుల్లో ప్రజలు పరిశుభ్రత , మెయింటెయిన్డ్ ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడుతున్నారు. అందువల్ల, ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు శుభ్రమైన వంటగదిని కలిగి ఉండాలి. దీన్ని ప్రారంభించడానికి, మీకు పాత్రలు, గ్యాస్ సిలిండర్ వంటి వస్తువులు అవసరం. మీరు ఎప్పుడైనా , ఎక్కడి నుండైనా క్యాటరింగ్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదించవచ్చు
ఈ రోజుల్లో చిన్న పార్టీలలో కూడా క్యాటరింగ్ ఆర్డర్లు ఇస్తున్నారు. ఈ వ్యాపారంలో మీకు శ్రమ కూడా అవసరం. పెద్ద బడ్జెట్ అవసరం లేని వ్యాపారం ఇది. అలాగే, ఇది ఎప్పటికీ కొనసాగే వ్యాపారం. ప్రారంభ దశలో, మీరు దీని నుండి నెలకు 25-50 వేల రూపాయలు సంపాదించవచ్చు, కానీ తరువాత వ్యాపారాన్ని పెంచుకోవడం ద్వారా, మీరు దీని నుండి నెలకు లక్షల రూపాయలు సంపాదించవచ్చు.

ఇక క్యాటరింగ్ వ్యాపారానికి కావలసింది పనివారు. ముఖ్యంగా మీరు పొందే ఆర్డర్లను బట్టి వంట వాళ్లను నియమించుకోవాలి. అలాగే సరుకులను ఎప్పటికప్పుడు హోల్సేల్ మార్కెట్ ద్వారా కొనుగోలు చేసి స్టోర్ చేసుకోవాలి కూరగాయలను కూడా మార్కెట్ నుంచి తాజాగా ఎప్పటికప్పుడు తెచ్చుకోవాలి. అప్పుడే రుచి నాణ్యత మెయింటెన్ అవుతాయి. అలాగే మీ కేటరింగ్ వ్యాపారాన్ని పది మందికి  తెలియజేయాలంటే పబ్లిసిటీ చేయాల్సి ఉంటుంది ఇందుకోసం మీరు ముందుగా న్యూస్ పేపర్ యాడ్ లేదా డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా తెలియజేయవచ్చు.  అలాగే ఫంక్షన్ హాల్ లతో టై అప్ చేసుకోవడం ద్వారా  ఆర్డర్లను సులభంగా పొందవచ్చు. 

 మొదట్లో లాభాల మార్జిన్ కాస్త తక్కువగా పెట్టుకుంటే మంచిది అలాగే మీరు ఏ ఫంక్షన్ లో అయితే కేటరింగ్ చేశారో,  అక్కడికి వచ్చిన వారు మీ విజిటింగ్ కార్డు భవిష్యత్తులో ఆర్డర్లు పొందే అవకాశం దక్కుతుంది.  అలాగే కిట్టి పార్టీ లు, బర్త్ డే ఫంక్షన్లకు కూడా క్యాటరింగ్ నిర్వహించడం ద్వారా నిరంతరం మీరు పొందే అవకాశం ఉంటుంది. అలాగే క్యాటరింగ్ సర్వీసు తో పాటు మీరు మధ్యాహ్నం కూడా మీల్స్ అలాగే కర్రీ పాయింట్ కూడా నిర్వహించుకోవచ్చు.  తద్వారా మనకు అదనపు ఆదాయం లభిస్తుంది. 

click me!