Gold vs Silver: మీరు వెంట‌నే కొనాల్సింది బంగారం కాదు వెండి.. ఎందుకంటే?

Published : Apr 14, 2025, 09:32 PM ISTUpdated : Apr 14, 2025, 09:33 PM IST

Gold Reigns, But Silver Rules the Future:  బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  సాధారణంగా, బంగారం, వెండి రెండూ విలువైన లోహాలు కావ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్నా కోనుగోలు విష‌యంలో చాలా మంది వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. అయితే మీరు ఇప్పుడు ముందు కొనాల్సింది బంగారం కాదు వెండి. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
14
Gold vs Silver: మీరు వెంట‌నే కొనాల్సింది బంగారం కాదు వెండి..  ఎందుకంటే?

Gold Reigns, But Silver Rules the Future: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పోటీ పడుతూ పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ భారత్ లోనే కాదు ప్ర‌పంచ దేశాల్లో వీటికి ఉన్న క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌టం లేదు. ధ‌ర‌లు ఎంతలా పెరిగినా కొనుగోళ్లు కూడా అదే విధంగా ఉంటున్నాయి.

అయితే, చాలా మంది వెండి కంటే బంగారం కొనుగోలు వైపు ఎక్క‌వ ఆస‌క్తి చూపిస్తుంటారు. కానీ, మీరు ఇప్పుడు వెంట‌నే కొనాల్సింది బంగారం కాదు వెండిని కొనాలి. కాద‌ని ముందుకు సాగితే మీరు చాలా న‌ష్ట‌పోతారు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. 

24

బంగారం, వెండి ధరల పెరుగుద‌ల భవిష్యత్ ఆర్థిక ప్రభావాలను ఎలా చూపుతుంద‌నే సూచ‌న‌లు  పంపుతున్నాయి. సాధారణంగా, బంగారం, వెండి రెండూ విలువైన లోహాలు కావ‌డంతో ధ‌ర‌లు పెరుగుతున్నా కోనుగోలు విష‌యంలో చాలా మంది వెన‌క్కి త‌గ్గ‌డం లేదు.

ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో (ఏప్రిల్ 14, 2025) బంగారం, వెండి ధ‌ర‌లు గ‌మ‌నిస్తే.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు దాదాపు ₹9,338 ఉండగా, వెండి గ్రాముకు దాదాపు ₹99.90 ధర ఉంది. అంటే 24 క్యారెట్ల  తులం బంగారం ధ‌ర 93,380 రూపాయ‌లుగా ఉంది. కిలో వెండి ల‌క్ష రూపాయ‌ల‌కు చేరువైంది. 

34

ಇನ್ನು, 24 ಕ್ಯಾರೆಟ್​ನ 10 ಗ್ರಾಂ ಚಿನ್ನದ ದರ 380 ರೂಪಾಯಿ ಇಳಿಕೆಯಾಗಿದ್ದು, 53,180 ರೂಪಾಯಿ ಆಗಿದೆ. 

ఇటీవ‌ల బంగారం, వెండి ధ‌ర‌లు గ‌మ‌నిస్తే రెండూ కూడా భారీగా పెరుగుతున్నాయి. అయితే, రాబోయే రోజుల్లో వెండి ధ‌ర‌లు డ‌బుల్ అవుతాయ‌ని రిపోర్టులు నివేదిస్తున్నాయి. 

రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఈ సంవత్సరం వెండి ధరలు రెట్టింపు అవుతాయనీ, వెండికి మ‌స్తు డిమాండ్ ఉంటుంద‌ని అంచనా వేశాడు. పరిమిత సరఫరా కారణంగా  వెండి ప్ర‌స్తుతం అత్యంత హాటెస్ట్ పెట్టుబడిగా పెర్కొన్నారు. 

44
gold and silver

బంగారం కంటే వెండిమీద పెట్టుప‌డి పెట్ట‌డంతో మీరు మ‌రింత‌గా లాభ‌ప‌డతార‌ని చెప్పాడు. ఎక్స్ వేదిక‌గా ఒక పోస్ట్‌లో కియోసాకి వెండి ప్రస్తుత ధర ఔన్సుకు $34 ఉండ‌గా, ఈ ఏడాదిలో డ‌బుల్ రేటు అవుతుంద‌నీ, ఔన్సుకు కనీసం $70కి చేరుకుంటుందని అంచ‌నా వేశాడు. అలాగే, ఇటీవల రిపబ్లిక్ మానిటరీ ఎక్స్ఛేంజ్ నుండి ఎక్కువ వెండిని కొనుగోలు చేసిన‌ట్టు కూడా తెలిపాడు. 

కాబ‌ట్టి మీరు ఇప్పుడు బంగారం కొనేకంటే వెండిని కోనుగోలు చేయ‌డం ఉత్త‌మం. ఎందుకంటే చాలా రిపోర్టుల ప్ర‌కారం వెండి ధ‌ర‌లు పెరుగుద‌ల అంచ‌నాలు భారీగా ఉన్నాయి. వెండిపై పేట్టుబ‌డుల‌తో మీకు మ‌స్తు లాభం రావ‌చ్చు. కొన్ని సంవత్సరాల ధరలు గమనిస్తే బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీటిని కోనుగోలు చేయడం లేదా వీటిపై పెట్టుబడులు మీకు లాభదాయకంగానే ఉంటుందని మార్కెట్ నిపుణులు కూడా చెబుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories