Business Ideas: మహిళలు కేవలం 1000 రూపాయలతో ఈ కోర్సు చేస్తే చాలు..నెలకు రూ. 50 వేల సంపాదన మీ సొంతం..

First Published May 22, 2023, 6:24 PM IST

మహిళలు మీరు ఇంటి వద్ద ఖాళీ సమయంలో ఆదాయం సంపాదించాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే తప్పకుండా ప్రతిరోజు కొద్ది గంటలు కేటాయిస్తే చాలు. మీరు చక్కటి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. అలాంటి ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాం.  

ముఖ్యంగా మహిళలు తమ ఇంటి వద్ద ఉంటూ సంపాదించగలిగే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి ఓ బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా ప్రతిరోజు మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. 
 

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాల ప్రభావంతో మన దక్షిణ భారతదేశంలో కూడా వివాహ వేడుకల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మెహందీ ఫంక్షన్ పేరిట పెళ్లికి ముందు రోజు అమ్మాయి ఇంట్లో అందరూ స్త్రీలు తమ చేతులకు మెహేంది డిజైన్స్ వేయించుకోవడం చూస్తూ ఉన్నాము.  ఈ మెహందీ ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా మెహేంది డిజైనర్ లను పిలిపిస్తారు వీరికి డబ్బు చెల్లించి మహిళలు తమ చేతులకు మెహందీ డిజైన్స్ పెట్టించుకుంటారు. 

 మీరు కూడా మెహందీ డిజైనింగ్ ను ఒక కెరీర్ ఆప్షన్ గా తీసుకోవాలంటే మాత్రం మెహందీ డిజైనింగ్ కోర్సులు చేస్తే సరిపోతుంది.  మెహందీ డిజైనింగ్ కూడా నేర్పిస్తారా అనే సందేహం మీకు కలిగే అవకాశం ఉంది కానీ మెహందీ డిజైనింగ్ చేయడం ద్వారా మీరు ప్రొఫెషనల్ గా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే సెట్విన్ సంస్థ మెహందీ డిజైనింగ్ కోర్సులను నేర్పిస్తోంది.  ముఖ్యంగా చదువుతో సంబంధం లేకుండా  మహిళలందరికీ ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు కేవలం 1500 రూపాయలకే ఈ శిక్షణ పొందే వీలుంది. అంతేకాదు ఈ శిక్షణ అనంతరం సర్టిఫికెట్ కూడా జారీ చేస్తారు.

ఇక మెహందీ డిజైనింగ్ మీరు కెరీర్ గా ఎంచుకోవాలి అనుకుంటే ముఖ్య ముందుగా ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటే మంచిది తద్వారా మీకు నిరంతరం క్లైంట్స్ లభిస్తూ ఉంటారు అదేవిధంగా పార్కుల్లోనూ ఎమేజ్మెంట్ సెంటర్లలోనూ మీరు ఒక స్టాల్ ఏర్పాటు చేసుకొని మెహేంది డిజైనింగ్ చేయవచ్చు.  అలాగే బ్యూటీ పార్లర్ లో కూడా మీరు మెహందీ డిజైనింగ్ ను ఏర్పాటు చేయవచ్చు.  
 

Image: Getty Images

అయితే మహిళలు మెహందీ డిజైనింగ్ కోర్సును శిక్షణా తరగతుల కింద ఇతర యువతులకు  నేర్పించడం ద్వారా కూడా మంచి ఆదాయం పొందే వీలుంది. ఆన్లైన్ తరగతుల ద్వారా కూడా మీరు ఈ మెహందీ డిజైన్ కోర్సులను ఇతర విద్యార్థులకు నేర్పించి మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది.

ఇక పెళ్లిళ్లలో మెహందీ డిజైన్స్ చార్జీల విషయానికొస్తే ఒక చేతికి మెహందీ వేయడం ద్వారా 500 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారు.  ఈ లెక్కన రోజుకు కనీసం రెండు నుంచి మూడు వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది.  దీన్నిబట్టి చూస్తే నెలకు కనీసం 50 వేల రూపాయలు సంపాదించవచ్చు. 

click me!