ప్రస్తుతం మార్కెట్లో అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ మీకు కొనాలని ఉందా.. అయితే షావోమీ కంపెనీ తయారుచేసిన RedmiI ఫోన్స్ అతి తక్కువ ధరకే చక్కటి ప్రీమియం ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచింది. అయితే తాజాగా రెడ్‌మీ ఈ శుక్రవారం , మన దేశీయ మార్కెట్లోకి రెడ్‌మీ ఎ2 , రెడ్‌మీ ఎ2+ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది.
ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు 5,000 mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. మే 23 నుంచి ఈ ఫోన్ల ఆన్ లైన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లను Amazon, Mi.com, Mi హోమ్ స్టోర్స్, Xiaomi రిటైల్ భాగస్వాముల ద్వారా కొనుగోలు చేయవచ్చు.
Redmi A2 ధరలు ఇవే..
2 GB RAM, 32 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 5,999
2GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.6,499
4GB RAM + 64GB స్టోరేజ్ కోసం రూ.7,499
Redmi A2+ ధర ఇవే.
4GB RAM + 64GB వేరియంట్ ధర రూ. 8,499
ఈ స్మార్ట్‌ఫోన్‌లను బ్లాక్, లైట్ గ్రీన్, లైట్ బ్లూ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ICICI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ హ్యాండ్‌సెట్‌లను కొనుగోలు చేస్తే Redmi రూ. 500 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఈ ఫోన్లపై రెండేళ్ల పాటు వారంటీ కూడా ఇస్తున్నారు.
Redmi A2, Redmi A2+ స్పెసిఫికేషన్లు
ఈ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13పై రన్ అవుతాయి. ఇది 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.52-అంగుళాల HD+ (1,600 x 720 పిక్సెల్‌లు) LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. MediaTek Helio G36 SoC, 4 GB వరకు RAM ఈ స్మార్ట్‌ఫోన్‌లలో అందుబాటులో ఉన్నాయి.
వర్చువల్ ర్యామ్‌తో అందుబాటులో ఉన్న మెమరీని 7 GB వరకు పెంచుకోవచ్చు. ఇది AI సపోర్ట్ తో డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇది 8 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ , QVGA కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ , వీడియో చాట్ కోసం ముందు భాగంలో 5-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 64GB స్టరేజీతో వస్తున్నాయి. వీటిని మైక్రో SD కార్డ్‌ని ఉపయోగించి 512GB వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. కనెక్టివిటీ కోసం, Wi-Fi, బ్లూటూత్ , 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వీటిలో అందుబాటులో ఉన్నాయి.
Redmi A2+లో సేఫ్టీ కోసం ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల , 5,000 mAh బ్యాటరీ 10 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
ఇదిలా ఉంటే ఈ నెల ప్రారంభంలో, కంపెనీ రెడ్‌మి నోట్ 12ఎస్‌ను సైతం విడుదల చేసింది. ఐస్ బ్లూ, పెరల్ గ్రీన్ , ఒనిక్స్ బ్లాక్ అనే మూడు కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కానీ ప్రస్తుతం ఇది పోలాండ్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.