Business Ideas: మహిళలు కేవలం రూ. 3000తో ఈ కోర్సు చేస్తే చాలు నెలకు రూ. 50 వేలు సంపాదించవచ్చు...

First Published | May 22, 2023, 5:32 PM IST

మహిళలు మీరు ఖాళీ సమయంలో కేవలం రోజుకు కొన్ని గంటలు మాత్రమే కష్టపడితే చాలు, నెలకు కొన్ని లక్షల ఆదాయాన్ని సంపాదించే వీలుంది, అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది. ప్రస్తుతం ఓ మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ మధ్యకాలంలో డిజైనర్ వేర్ వస్త్రాలు కొనేందుకు యువతీ యువకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  షాపులో లభించే బట్టల కన్నా కూడా తమకు కావాల్సిన డిజైన్లను దగ్గరుండి కుట్టించుకొని డిజైన్ చేయించుకొని కష్టమైజ్డ్ దుస్తులు వేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి కష్టమైజ్డ్ దుస్తులను ధరించాలంటే ఒకవేళ తయారు చేయించుకోవాలన్నా కూడా ఫ్యాషన్ డిజైనర్ అనేవారు అవసరం, ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ డిజైనర్లకు చక్కటి డిమాండ్ ఉంది.  ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్న వారు ఫ్యాషన్ డిజైనర్లుగా అవతరిస్తున్నారు. 
 

ఫ్యాషన్ డిజైనర్లు ముఖ్యంగా తమ కస్టమర్ అభిరుచిని, అదేవిధంగా అతని శరీర ఆకృతిని బేస్ చేసుకొని చక్కటి డ్రెస్ లను డిజైన్ చేస్తూ ఉంటారు.  అప్పుడే ఈ డ్రెస్సులు చూసేందుకు చూడముచ్చటగా ఉంటాయి, ఎక్కువగా వివాహ మహోత్సవాల్లో వధూవరులు ఇలాంటి డ్రెస్ డిజైన్లను వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.  అంతే కాదు థీం పార్టీలకు వెళ్లేవారు సైతం ఇలాంటి డ్రెస్ డిజైన్లను ఎంచుకుంటున్నారు.  అలాగే ఫ్యాషన్ డిజైనర్లకు సినిమా రంగంలో కూడా చక్కటి డిమాండ్ ఉంది మీరు కూడా ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణించాలి అనుకుంటే,  ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.


కానీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో శిక్షణ అంటే లక్షల్లో ఫీజులు చెల్లించాలా అనే అపోహ ఉంది.  నిజానికి అతి తక్కువ ధరకే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చక్కటి శిక్షణ పొందే వీలుంది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సెట్విన్ సంస్థ మహిళల కోసం ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులను అందిస్తోంది. కేవలం 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయితే చాలు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోని వివిధ కోర్సులను సెట్విన్ సంస్థ శిక్షణ అందిస్తోంది.  ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో పలు కేంద్రాల్లో సెట్విన్ సంస్థకు శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. 

ఫీజుల విషయానికి వస్తే సెట్విన్ సంస్థలో అతి తక్కువ ధరకే ఫీజులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు మూడు సెమిస్టర్ లలో నేర్పిస్తారు. ఒక్కో సెమిస్టర్ కు కేవలం 3000 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసిన తరువాత సర్టిఫికెట్ కూడా ఇస్తారు.  ఈ సర్టిఫికెట్ ద్వారా మీరు ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థల్లో ఉద్యోగం పొందే అవకాశం ఉంది.  లేదా మీరే స్వతంత్రంగా బోటిక్ ఏర్పాటు చేసుకోవచ్చు, 

మీరు సినీ పరిశ్రమలో కూడా ఫ్యాషన్ డిజైనర్ గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుంది.  అలాగే మీరు డిజైన్ చేసిన దుస్తులతో ఓ చక్కటి ఫ్యాషన్ షో కూడా ఏర్పాటు చేయడం ద్వారా మీకు మంచి పబ్లిసిటీ లభిస్తుంది. ఫ్యాషన్ షో అనగానే మీరు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని భావించవచ్చు.  కానీ కాలేజీ ఫెస్టివల్స్ లో అక్కడి యువతీ యువకులకు మీరు తయారు చేసిన డిజైన్ చేసిన దుస్తులతో  ఫ్యాషన్ షో  నిర్వహిస్తే ఆ కాలేజీలో విద్యార్థులు సైతం మీ డిజైన్లకు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది.  ఫ్యాషన్ డిజైనర్ గా మీరు ప్రతి నెల రూ. 50 వేలు, రూ. 5 లక్షలు వరకు పొందే వీలుంది. 
 

Latest Videos

click me!