ఉదాహరణకు ఊరగాయల బిజినెస్ పెట్టుకోవడం ద్వారా మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే ఊరగాయలు సంవత్సరం పొడుగుతున్న నిలువగా ఉంటాయి ఒక్కసారిగా పాడవ్వవు. సంవత్సరం పొడుగుతా వీటిని స్టోర్ చేసుకొని విక్రయించుకుంటే మంచి లాభం పొందవచ్చు. ఊరగాయల్లో నాన్ వెజ్ ఊరగాయాలను తినేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్స్ పికిల్, క్రాబ్స్ పికిల్ వంటివి తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నాన్ వెజ్ పచ్చళ్లను విదేశాలకు సైతం తీసుకువెళ్లేందుకు జనం ఆసక్తి చూపిస్తున్నారు.