Business Ideas: మహిళలు ఇంటి దగ్గర జస్ట్ ఒక గంట కష్టపడితే చాలు రోజుకు రూ.500 సంపాదించే అవకాశం..ఎలాగంటే..?

First Published Aug 25, 2022, 3:22 PM IST

గృహిణులు డబ్బు సంపాదించడమే మీ లక్ష్యమా, అయితే పిల్లలు, ఇంటి బాద్యతలు మిమ్మల్ని అడ్డుకుంటున్నాయా, బాధపడకండి, ఓ చిన్న ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అలాంటి బిజినెస్ ఐడియా కోసం వెతుకున్నారా, అయితే ఇది మీకు చాలా ఉపయోగపడవచ్చు. అదేంటో తెలుసుకుందాం. 
 

ప్రస్తుతం యుగంలో ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం కోసం తాపత్రయ పడుతున్నారు. జీవన విధానం ద్వారానే ఆరోగ్యంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఆహారం, ప్రపంచంలోని అందరు డైటీషియన్లు కూడా సలాడ్స్ ను బెస్ట్ ఫుడ్ గా సూచిస్తున్నారు. వీటిలో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు, అంతేకాదు బీపీ, షుగర్, ఇతర వ్యాధుల వారు కూడా ఈ సలాడ్స్ తీసుకోవచ్చు. 
 

Sprouts

అయితే సలాడ్స్ తో పాటు మొలకెత్తిన గింజలు కూడా చాలా ఆరోగ్యకరమైనవి, నిజానికి చిన్న పెద్ద ప్రతీ ఒక్కరూ మొలకెత్తిన గింజలను తింటే మంచి ప్రోటీన్లు లభిస్తాయి. అంతేకాదు మొలకెత్తిన గింజల్లో పలు విటమిన్లు ఉంటాయి. అన్ని ఏజ్ గ్రూప్స్ వారు మొలకెత్తిన గింజలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ముందుగా అనేక రకాల గింజలను తీసుకొని నానబెట్టి, వాటిని మొలకెత్తించాలి.

సెనగలు మంచి పౌష్టికాహారం. ఇందులో ప్రోటీన్స్ తో పాటు ఐరన్, క్యాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్ వంటి వివిధ ఖనిజాలు (Minerals) పుష్కలంగా ఉంటాయి. అలాగే వీటితో పాటు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు (Omega 3 fatty acids) కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యానికి కలుగచేసే ప్రయోజనాలు బోలెడు.
 

కానీ చాలా మందికి బిజీ లైఫ్ కారణంగా మొలకెత్తిన గింజలను తయారు చేయడం చాలా కష్టం, వారి అవసరమే మీకు వ్యాపార అవకాశంగా మారుతుంది. మొలకెత్తిన గింజలను మీరు ప్రతీ ఒక్కరికీ డోర్ డెలివరీ చేయడం ద్వారా మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ఇందుకోసం మీరు రోజుకు ఓ గంట కష్టపడితే సరిపోతుంది. 

మొదట మీరు వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంటే, ఓ పాంప్లెట్ ద్వారా కస్టమర్లను పొందవచ్చు. దానిపై ఫోన్ నెంబర్ ను జత చేయడం ద్వారా మీరు ఈ సర్వీసు కోరుకునే కస్టమర్లను సులభంగా పొందవచ్చు. ఇక మీరు చేయవలసిందల్లా ఒక్కటే, కస్టమర్ల ఇంటికి టైంకి చేరవేయడమే, చాలా మంది మొలకెత్తిన గింజలను తమ బ్రేక్ ఫాస్ట్ తో పాటు తీసుకుంటారు. అందుకే మీరు ఉదయం పూటనే ఈ పనిచేయాల్సి ఉంటుంది. 

ముందుగానే గింజలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇక డెలివరీ కోసం మీరు న్యూస్ పేపర్, మిల్క్ డెలివరీ బాయ్స్ తో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. వారి ద్వారా మీ కస్టమర్లకు మొలకెత్తిన గింజలను డోర్ డెలివరీ చేయవచ్చు. ఇందుకోసం వారికి కమిషన్ ఇస్తే సరిపోతుంది. ఇక ప్యాకింగ్ విషయానికి వస్తే చిన్న పాలిథిన్ సంచులు, లేదా బాక్స్ టైప్ ప్యాకింగ్ మెటీరియల్ వాడితే సరిపోతుంది. మీరు ఉపయోగించే దినుసులు, ప్యాకేజింగ్ సామాగ్రి, డెలివరీ బాయ్ కమిషన్ కలుపుకొని ఒక ప్యాకెట్ ధర నిర్ణయించుకోండి. తద్వారా మీకు మంచి ఆదాయం లభిస్తుంది. 
 

మొలకెత్తిన గింజలతో పాటు, కూరగాయలు, పండ్ల ముక్కలను కూడా ప్యాక్ చేసి డెలివరీ చేయవచ్చు. తద్వారా మీకు అదనంగా ఆదాయం చేకూరుతుంది. ఒక ప్యాకెట్ విలువ కనీసం 20 రూపాయలు అనుకున్నా...అందులో ముడి సరుకు, డెలివరీ చార్జీలు కలుపుకొని కనీసం 10 రూపాయలు ఖర్చుచేసినా మీకు మరో పది రూపాయలు మిగులుతుంది. ఈ లెక్కన మీరు రోజుకు 50 ఇళ్లకు సరఫరా చేసిన రోజుకు 500 రూపాయల లాభం మీ సొంతం అవుతుంది. ఇందుకోసం మీరు రోజులో కేవలం ఒక గంట నుంచి రెండు గంటల సమయం కేటాయిస్తే సరిపోతుంది. 

click me!