Business Ideas: ఉన్న ఊరిలోనే రూ.25 వేల పెట్టుబడితో నెలకు రూ. 1 లక్ష వరకూ సంపాదించే అవకాశం..ఏం చేయాలంటే..

First Published Oct 25, 2022, 12:54 PM IST

ఉద్యోగం లభించడం లేదని ఎదురు చూడటం కన్నా,  సొంత కాళ్లపై నిలబడి వ్యాపారం చేయడం చాలా ఉత్తమమైన పని,   ప్రస్తుతం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.  అతి తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తోంది.  తద్వారా చక్కటి  ఆదాయం పొందే వీలుంది. 

బిజినెస్ చేయడమే లక్ష్యమా అయితే అతి తక్కువ పెట్టుబడి తో ని చక్కటి ఆదాయం పొందే వ్యాపార అవకాశాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయం సంపాదించే వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.  మరోవైపు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్ర రుణాల ద్వారా యువతను సొంత వ్యాపారాలు చేసుకునేందుకు ప్రోత్సహిస్తోంది. 

మీరు కూడా ముద్ర రుణం తీసుకుని వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నట్లయితే ఈ వ్యాపార అవకాశం మీకు చాలా ఉపయోగపడుతుంది.  ప్రస్తుతం పట్టణాల్లో నుంచి పల్లెటూర్ల వరకు ప్రతి ఒక్కరూ ఉదయం పూట అల్పాహారం చేయడం చాలా కామన్ అయిపోయింది.  ప్రస్తుతం అన్ని రోజుల్లోనూ టిఫిన్ సెంటర్లు చాలా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. అందుకే మీరు కూడా ఒక టిఫిన్ సెంటర్ రన్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే వీలుంది ఇప్పుడు టిఫిన్ సెంటర్ వ్యాపారం చేయాలంటే  పెట్టుబడి ఎంత ఆదాయం ఎంతో తెలుసుకుందాం. 

టిఫిన్ సెంటర్ వ్యాపారానికి ముందుగా కావలసింది మంచి సెంటర్  అవసరం.  బస్టాండ్,  రైల్వే స్టేషన్,  వ్యవసాయ మార్కెట్ లు,  ఆసుపత్రులు,  ఫ్యాక్టరీలు,  విద్యాసంస్థలు,  కాలనీలు,  దేవాలయాలు,  ఇలా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రదేశాలు అయితే ఈ టిఫిన్ సెంటర్లు క్లిక్ అవుతాయి. 

 మీరు టిఫిన్ సెంటర్ ను రెండు రకాలుగా ఓపెన్ చేయొచ్చు.  ఒకటి షాపు రెంటుకు తీసుకొని టిఫిన్ సెంటర్ ప్రారంభించవచ్చు.  లేదా ఒక మొబైల్ వాహనం ద్వారా కూడా మీరు టిఫిన్ సెంటర్ ప్రారంభించవచ్చు.  చివరకు ఒక బైక్  ఉంటే కూడా మొబైల్ టిఫిన్ సెంటర్ ప్రారంభించే వీలుంది.  టిఫిన్ సెంటర్ వ్యాపారానికి కావలసింది ఒక కమర్షియల్ స్టవ్,  అలాగే వంటపాత్రలు,  కమర్షియల్ గ్యాస్ సిలిండర్,  ప్లేట్లు గ్లాసులు కుర్చీలు అవసరమవుతాయి.  ఇందుకోసం మీరు కనీసం 25 వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు చేయవచ్చు. 

ఇక మొబైల్ టిఫిన్ సెంటర్ ప్రారంభించాలంటే కమర్షియల్ వెహికల్ కొనుగోలు చేసి దాన్ని మొబైల్ టిఫిన్ సెంటర్ గా మాడిఫై చేయాల్సి ఉంటుంది.  నిజానికి మొబైల్ టిఫిన్ సెంటర్లకు  అద్దె బాధ ఉండదు.  అయితే స్థానిక  మునిసిపాలిటీ నుంచి పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.  ఇక టిఫిన్ టిఫిన్ చేసేందుకు వంట వాళ్లను పెట్టుకోవడం కన్నా,  మీరు స్వయంగా చేస్తేనే ఎక్కువ లాభం వస్తుంది. వంట వాళ్లపై  ఆధారపడితే,  వాళ్లు మానివేసిన రోజు టిఫిన్ సెంటర్ రన్ అవ్వదు. 

మీరు చేసే టిఫిన్,  ఇడ్లీ, దోష,  వడ, పూరి వంటివి పెట్టుకోవడం ద్వారా  కస్టమర్లను ఆకర్షించవచ్చు. ఇక వంటల్లో ఉపయోగించే తయారీ కోసం నాణ్యమైన వంట సరుకులు ఉపయోగించాలి.  నాణ్యమైన వంటనూనె,  నాణ్యమైన పప్పులు,  కూరగాయలు,  ఉపయోగించాలి అప్పుడే కస్టమర్లు తరలివస్తారు. వేడి వేడి టిఫిన్స్ తినేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. 

click me!