Muhurat Trading 2022: IIFL సంస్థ అందించిన దివాలీ స్టాక్ రికమండేషన్స్ ఇవే..మీ అదృష్టం పరీక్షించుకునే అవకాశం

Published : Oct 24, 2022, 04:50 PM ISTUpdated : Oct 24, 2022, 04:52 PM IST

Diwali stock recommendations 2022: దీపావళి 2022 వేడుకల సందర్భంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ముహూరత్ ట్రేడింగ్ సెషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు, ఈరోజు సాయంత్రం 6:15 నుండి 7:15 వరకు ముహూరత్ ట్రేడింగ్ జరగనుంది. కొత్త సంవత్సరానికి  నాంది పలికినందున ముహూరత్ ట్రేడింగ్ పెట్టుబడిదారులలో శుభప్రదంగా పరిగణించబడుతుంది.

PREV
18
Muhurat Trading 2022:  IIFL సంస్థ అందించిన దివాలీ స్టాక్ రికమండేషన్స్ ఇవే..మీ అదృష్టం పరీక్షించుకునే అవకాశం

హిందూ క్యాలెండర్ సంవత్సరంలో కొత్త సంవత్ 2079 ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా స్టాక్ మార్కెట్ లో ముహూరత్ ట్రేడింగ్ జరగనుంది. అంటే దీపావళి సెలవు రోజు కూడా  స్టాక్ మార్కెట్ ఈ రోజు తెరుచుకోనుంది. ముహూరత్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టడం చాలా లక్కీగా ఇన్వెస్టర్లు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా రికమెండ్ చేసిన టాప్ 5 స్టాక్‌ రికమండేషన్స్ తెలుసుకుందాం. ఇందులో మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు చక్కటి లాభాలను పొందవచ్చు. అనూజ్ గుప్తా ఈ స్టాక్స్ పై కొనుగోలు కాల్ ఇవ్వడం విశేషం అవేంటో తెలుసుకుందాం.

28

ఫెడరల్ బ్యాంక్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ మంచి పనితీరు కనబరిచింది. ఈ బ్యాంక్ షేరు ప్రస్తుతం రూ.132.85 వద్ద ట్రేడవుతోంది. వచ్చే దీపావళి నాటికి షేర్ ధర రూ.230 స్థాయికి చేరుకోవచ్చు.
 

38

రేణుకా షుగర్ : రూపాయి పతనం కారణంగా చక్కెర కంపెనీల లాభాలు పెరిగాయి. రేణుకా షుగర్ కూడా లాభపడింది. ప్రస్తుతం కంపెనీ షేరు ధర రూ.58.65. వచ్చే దీపావళి నాటికి షేరు ధర రూ.120కి చేరవచ్చు.

48

కోల్ ఇండియా లిమిటెడ్: ప్రభుత్వ సంస్థ కోల్ ఇండియా డివిడెండ్ ఇవ్వడంతో పాటు రుణ రహిత సంస్థ. ప్రస్తుత షేర్ ధర రూ.238. ఇది రూ.500 వరకు ఉంటుంది.
 

58

DLF: కరోనా తర్వాత, ఇళ్ల అమ్మకాలు వేగంగా పెరిగాయి. దీంతో రియల్ ఎస్టేట్ రంగం లాభపడింది. DLF టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ కంపెనీ షేరు ధర రూ.369.50. వచ్చే ఏడాదిలో అది రూ.600 కావచ్చు.

68

ఇండియన్ హోటల్ కంపెనీ: కరోనా తర్వాత మరోసారి హోటల్ పరిశ్రమ పరిస్థితి మెరుగుపడుతోంది. కంపెనీ షేరు ధర వచ్చే ఏడాదిలో రూ.255 స్థాయి నుంచి రూ.500 స్థాయికి చేరుకోవచ్చు.
 

78

ముహూరత్ ట్రేడింగ్ సమయం ఇదే.. BSE ఇచ్చిన సమాచారం ప్రకారం, ముహూర్త ట్రేడింగ్ 24 అక్టోబర్ 2022 న దీపావళి రోజున సాయంత్రం 6.15 నుండి 7.15 గంటల వరకు జరుగుతుంది. బ్లాక్ డీల్ సాయంత్రం 5.45 నుండి 6 గంటల వరకు జరుగుతుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకారం, ముహూర్త ట్రేడింగ్ ప్రీ-ఓపెన్ ట్రేడింగ్ సెషన్ సాయంత్రం 6.00 నుండి 6.08 వరకు ఉంటుంది. అదే సమయంలో, ముగింపు సెషన్ సాయంత్రం 7.15 నుండి 7.25 మధ్య ఉంటుంది.

 

88

(నోట్: పైన పేర్కొన్న స్టాక్స్ నిపుణుల సలహా మాత్రమే. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు రిస్కుతో కూడినవి, మీ లాభ నష్టాలకు మా వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు. ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు, తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. నిపుణుల సలహా తీసుకోండి)

Read more Photos on
click me!

Recommended Stories