Business Ideas: మహిళలు ఇంటి వద్ద ఉండే సంపాదించుకోగలిగే చక్కటి బిజినెస్ ప్లాన్ ఇదే, నెలకు రూ. 50 వేలు పక్కా..

First Published Feb 2, 2023, 3:36 PM IST

వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని చాలామంది అనుకుంటారు కానీ అందుకు తప్పే సరైన ప్రణాళిక లేక ముందడుగు వేయలేరు.  నిజానికే వ్యాపారం చేయడం ద్వారా ఉద్యోగం చేయడం కన్నా కూడా ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది.  అంతే కాదు వ్యాపారానికి ఎంత కష్టపడితే అంత సంపాదన సంపాదించే అవకాశం ఉంటుంది.  అలాగే మీ తెలివితేటలను పూర్తిగా వినియోగించుకునే అవకాశం దక్కుతుంది.

lunch box

 ప్రస్తుతం ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం మహిళలు తమ ఇంటి వద్ద ఉంటూనే ఈ బిజినెస్ చేయడం ద్వారా చక్కటి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది.  తద్వారా వారు పెరుగుతున్న ఖర్చులకు చెక్ పెట్టే అవకాశం లభిస్తుంది అలాగే  సొంత కాళ్ళ పైన నిలబడే అవకాశం కూడా కలుగుతుంది అలాంటి ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. 

diet for lunch

 ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది షుగర్ వ్యాధితో పేరిట చలామణి అయ్యా ఈ మధుమేహం సైలెంట్ కిల్లర్ అనే చెప్పాలి.  ఒకప్పుడు 60 సంవత్సరాల పైబడ్డ వారికి మాత్రమే మధుమేహం వచ్చేది.  కానీ ఇప్పుడు 40 సంవత్సరాల వయసు నుంచే మధుమేహం వస్తోంది.  మధుమేహానికి ఎన్ని మందులు ఉన్నప్పటికీ.  ఆహార నియంత్రణ డైట్ అనేది తప్పనిసరి.  అయితే ప్రస్తుత బిజీ  జీవితంలో  డయాబెటిస్ సంబంధించినటువంటి డైట్ నియమాలు పాటించడం దాదాపు అసాధ్యమే.  దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే అవకాశం ఉంది. 

 డయాబెటిస్  డయాబెటిస్ డైట్ అనేది ప్రస్తుతం చాలామంది పాటిస్తున్నారు అయితే ఉద్యోగులు వ్యాపారులు ఇతర బిజీ పనుల్లో ఉండే వారికి.  డయాబెటిస్ డేట్ తయారు చేసుకోవడం చాలా కష్టమైన పని అలాంటి వారికి మీరు డయాబెటిస్ థాలీ  అందించడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది . ముందుగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఏ ఆహారం తింటే డయాబెటిస్ తక్కువగా కంట్రోల్ లో ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. . అందుకు తగినట్టుగా మీరు లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోగలగాలి. 

 ఉదాహరణకు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు అందుకనే మామూలు బియ్యం కన్నా కూడా బ్రౌన్ రైస్ లేదా డయాబెటిస్ రైస్ తీసుకోవడం చాలా ముఖ్యం.  అలాగే వీరికి సంబంధించిన డైట్ లో తీపి పదార్థాలు ఉండకూడదు.  ఉదాహరణకు స్వీట్లు బెల్లం పంచదార వంటి వస్తువులను వాడకూడదు. . అలాగే అధికంగా నూనెలో వేయించిన వేపుళ్ళు పచ్చళ్ళు వంటివి ఉండకూడదు.  న్యూట్రీషియన్ల వద్ద డయాబెటిస్ డైట్ కి సంబంధించి సలహాలు తీసుకుంటే మంచిది.  లేదా మీరే న్యూట్రిషన్ సంబంధించినటువంటి కోర్సు చేస్తే కూడా మంచిది.  తద్వారా స్వయంగా డయాబెటిస్ డైట్ తయారు చేసి మీరు సప్లై చేయవచ్చు. 
 

 ముందుగా మీరు ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా ఈ డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు  మీరు డైట్ సప్లై చేస్తున్నాడు భోజనం లంచ్ సప్లై చేస్తామని ప్రచారం చేయండి..  క్లైంట్స్ వచ్చినా అనంతరం వారికి మీరు లంచ్ డిన్నర్ తయారు చేసి చక్కటి ప్యాకేజీంగ్ చేసి  స్విగ్గి అండ్ జొమాటో లాంటి ఆన్లైన్ ప్లాట్ ఫాంలలో అందుబాటులో ఉంటే ఉంచితే మంచిది.  అప్పుడు డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు సులభంగా మీ ఫుడ్డు ఆర్డర్ చేసుకోవచ్చు.  
 

click me!