మనం చిన్నప్పుడు ఇంట్లో తినే సాంప్రదాయ చిరుతిండ్లు అయినా మురుకులు, సకినాలు, చేగోడీలు, బూందీ, కారప్పూస, పప్పు చెక్కలు, సర్వపిండి వంటివి ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. నిజానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. వీటిలో వాడే దినుసులు ఆరోగ్యానికి హానికరం కాదు. కావున ఇలాంటి సాంప్రదాయ స్నాక్స్ ను మీరు మంచి బ్రాండింగ్ చేసి ప్యాకింగ్ చేయడం ద్వారా పెద్ద ఎత్తున విక్రయించే అవకాశం ఉంది.