మరోవైపు జీవిత బీమా, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లు, హౌసింగ్, పీపీఎఫ్ వంటి సాధనాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సెక్షన్ 80సీ కింద పొందే ఆదాయపు పన్ను మినహాయింపు మొత్తాన్ని పెంచడంపై ఆర్థిక మంత్రిత్వ శాఖ సీరియస్‌గా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెక్షన్ 80సీ కింద ఏడాదికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టి పన్ను మినహాయింపు పొందవచ్చు.