ఉదాహరణకు మీకు ఏదైనా సంగీత వాయిద్యం వాయించడం వచ్చినట్లయితే, దానికి సంబంధించిన మ్యూజిక్ శిక్షణ తరగతులను, మీ స్మార్ట్ ఫోన్ ద్వారా రికార్డ్ చేసి, యూట్యూబ్లో అప్లోడ్ చేసినట్లు అయితే, మీకు వచ్చిన వ్యూస్ ప్రాతిపదికన యూట్యూబ్ డబ్బు చెల్లిస్తుంది. ఫేస్బుక్ ద్వారా కూడా మీ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పి డబ్బులు సంపాదించుకోవచ్చు.