Business Ideas: ఉన్న ఊరిలోనే కాలు మీద కాలు వేసుకొని, నెలకు కనీసం రూ. 1 లక్ష వరకూ సంపాదించ గలిగే బిజనెస్ ఇదే..

First Published Jan 9, 2023, 3:27 PM IST

ఉన్న ఊరిలోనే డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా.  నగరాల్లోనూ పట్టణాల్లోనూ జాబ్స్ చేసి చాలీచాలని జీతంతో ఇబ్బంది పడుతున్నారా.  అయితే ఇక ఏ మాత్రం సంకోచించవద్దు.  మీ గ్రామంలో ఉంటూనే ఆదాయం పొందే బిజినెస్ గురించి తెలుసుకుందాం. 

Sheep dog

లైవ్ స్టాక్ ద్వారా  మనం ఎప్పటికీ చక్కటి ఆదాయాన్ని పొందుతాము.  తక్కువ భూమి ఉన్నప్పటికీ,  మేకలు,  గొర్రెలు పెంచడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మటన్ తినేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.  మేక, పొట్టేలు మాంసం తినేందుకే ప్రజలు ఆసక్తి చూపిస్తారు.  పండుగల  సమయంలో మటన్ కు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.  ముఖ్యంగా తెలంగాణలో ఏ ఫంక్షన్ జరిగినా విందులో మటన్  ఉండాల్సిందే. 

sheep

అందుకే పెరుగుతున్న మటన్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది. దీనికి మీరు ఉన్న ఊరిలోనే కొద్ది స్థలంలోనే,  గొర్రెల ఫారం ఏర్పాటు చేసుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.   గొర్రెల పెంపకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సబ్సిడీ అందిస్తున్నాయి. అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఉచితంగా గొర్రె పిల్లలను పంపిణీ చేస్తోంది. నాబార్డ్ సైతం గొర్రెల ఫామ్ కోసం లోను సదుపాయాలతో పాటు సబ్సిడీ కూడా అందిస్తున్నాయి. తద్వారా మీరు సులభంగా గొర్రెల ఫారం ఏర్పాటు చేసుకోవచ్చు.

గొర్రెల ఫారం ఏర్పాటుకు  మీకు  అర ఎకరం నుంచి పావు ఎకరం స్థలం ఉంటే సరిపోతుంది.  అంతేకాదు మీరు మంచి షెడ్డు నిర్మించి,  పూర్తి శాస్త్రీయ పద్ధతిలో గొర్రెలను పెంచితే,  వాటి నుంచి  మంచి దిగుబడి సాధించవచ్చు. వెటర్నరీ డాక్టర్ సలహాలతో మందులు వ్యాక్సిన్లు వాడితే గొర్రెలు,  వ్యాధుల బారిన పడకుండా,  మంచి ఏపుగా ఎదుగుతాయి.  పండగ సీజన్లో గొర్రెలను విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది.  ఉదాహరణకు బక్రీద్ సీజన్ లో గొర్రెలకు  చాలా డిమాండ్ ఉంటుంది.  అలాగే బోనాల పండగ,  దసరా పండుగ సందర్భంగా కూడా  గొర్రెలకు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.

గొర్రె పిల్లలను సంరక్షించుకునేందుకు,  ప్రత్యేక పద్ధతులను పాటించాలి తరచూ వాటికి వ్యాక్సిన్లను ఇప్పించాలి.  వ్యాధి నిరోధకత కలిగిన మేలుజాతి గొర్రెలను ఎంపిక చేసుకొని పెంచితే చక్కటి ఆదాయం సంపాదించే వీలుంది. మార్కెట్లో మటన్ ధర సుమారు 800 రూపాయల వరకు ఉంటుంది. మటన్ వ్యాపారులకు గొర్రెల డిమాండ్ ఎప్పటికీ ఉంటుంది.  కావున రేటును  మీరే నిర్ణయించాలి.  రైతులే ఒక సంఘంగా ఏర్పడి రేటు నిర్ణయించుకుంటే మంచిది. 

ఇతర రాష్ట్రాలకు సైతం గొర్రెలను ఎగుమతి చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  అందుకోసం ట్రేడర్లను సంప్రదించాల్సి ఉంటుంది.  గొర్రెల పెంపకం ద్వారా మీకు చక్కటి ఆదాయం లభిస్తుంది.  గొర్రెల పెంపకం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.  వ్యవసాయ విశ్వవిద్యాలయం  ఆచార్యలు,  నిపుణులతో  తరచూ  సంప్రదిస్తూ మందులను వాడుతూ ఉండాలి.  అప్పుడే చక్కటి ఆదాయం పొందే వీలుంది. ఒక గొర్రె విలువ దాదాపు రూ. 15 నుంచి 20 వేల వరకూ ఉంటుంది. నెలకు 10 గొర్రెలు అమ్మినా, కనీసం రూ. 1. 50 లక్షల వరకూ ఆదాయం పొందవచ్చు. 

click me!