ఫ్రీలాన్సర్ జాబ్స్ ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు ఆఫర్ చేస్తుంటాయి. రెగ్యులర్ ఎంప్లాయిస్ కన్నా కూడా తక్కువ పెట్టుబడి తో, ఫ్రీలాన్సర్ లను రిక్రూట్ చేసుకుని ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటారు. ఫ్రీలాన్సర్ గా మీరు జాబ్ చేసే ముందు కంపెనీ ప్రొఫైల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఒక్కోసారి కొన్ని ఫేక్ కంపెనీలు మీతో ప్రాజెక్టు చేయించుకొని, డబ్బులు ఎగ్గొట్టే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది.