Business Ideas: ఒక్క ఎకరం ఉన్నా చాలు ఈ పంట పండిస్తే...కోట్లు మీ సొంతం అయ్యే అవకాశం..

First Published | Jun 5, 2023, 12:33 PM IST

ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరాశ చెందుతున్నారా.. ఇక ఏమాత్రం నిరాశ చెందకండి ఓ చక్కటి బిజినెస్ ప్రారంభించడం ద్వారా మీరు మంచి ఆదాయం పొందే వీలుంది..

ఈ బిజినెస్ కోసం మీరు కొద్దిగా భూమి ఉంటే సరిపోతుంది. ఈ భూమిలో మీరు చక్కటి వ్యవసాయం చేయడం ద్వారా వినూత్నమైన పద్ధతుల్లో మార్కెటింగ్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాంటి ఓ బిజినెస్ ఐడియాను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ ఐడియా ద్వారా మీరు అతి త్వరలోనే కోటీశ్వరులు అయ్యే అవకాశం కూడా ఉంది. 

 ఆయుర్వేదం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందుతోంది. ముఖ్యంగా ఆయుర్వేదం వైద్యం విదేశాల్లో సైతం చాలా ప్రాచుర్యం పొందుతోంది.. సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం వల్ల ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది స్వీకరిస్తున్నారు.  ముఖ్యంగా శాస్త్రవేత్తలు ఆయుర్వేదంలో అనేక మూలికలను కనుగొంటున్నారు.  ఆయుర్వేదానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఆయుర్వేద మూలికలకు కూడా డిమాండ్ భారీగా పెరుగుతోంది.  ఈ దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకునే వీలుంది. 


ఆయుర్వేదంలో చాలా మందిలో అశ్వగంధ ను ఎక్కువగా వాడుతూ ఉంటారు.  మీరు అశ్వగంధ పంటను వేయడం ద్వారా చక్కటి ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. అశ్వగంధ ఆకుల నుంచి వేర్ల వరకు అన్ని ఆయుర్వేదంలో మందులుగా వాడుతూ ఉంటారు. దీన్ని తెలుగులో పెన్నేరు గడ్డ అని కూడా అంటారు.  అశ్వగంధ వేళ్ళతో చేసిన చూర్ణం ఆయుర్వేదంలో విరివిగా వాడుతూ ఉంటారు దీనికి ధర కూడా చాలా ఎక్కువ. 

మీ వద్ద ఒకటి నుంచి రెండు ఎకరాల పొలం ఉన్నట్లయితే అశ్వగంధ మొక్కలను నాటుకోవచ్చు. ఔషధ మొక్కల గురించి మరింత సమాచారం కోసం ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారిని సంప్రదించవచ్చు. ఇక్కడ మీరు పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది.  అశ్వగంధ మొక్క సాగుకు పెద్దగా నీరు అవసరం లేదు నీటి ఎద్దడి ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ మొక్కలు సులభంగా పెరుగుతాయి నేల సారవంతం కూడా పెద్దగా ఉండాల్సిన పనిలేదు. 
 

చాలా తక్కువ నీటి యాజమాన్యంతోనే మీరు అశ్వగంధ మొక్కలను పెంచుకోవచ్చు. ముఖ్యంగా అశ్వగంధ మొక్కలను పెద్ద ఎత్తున మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పండిస్తూ ఉంటారు.  వీలైతే మీరు ఆ రాష్ట్రంలోని నిపుణుల వద్ద సలహాలను కూడా తీసుకోవచ్చు.  అయితే అశ్వగంధ మొక్కకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్ ఉంది. ఈ మొక్క వేర్లతో చేసిన పొడి కి అనేక ఔషధాల్లో వాడుతూ ఉంటారు. ముఖ్యంగా లైంగిక సంబంధిత  సామర్థ్యం పెంపు కోసం అశ్వగంధ పొడి తో చేసే క్యాప్సూల్స్ ట్యాబ్లెట్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే బహిరంగ మార్కెట్లో అశ్వగంధ కు మంచి ధర లభించే అవకాశం ఉంది. 

ప్రధానంగా ఆయుర్వేద మందులు తయారు చేసే కంపెనీలతో మీరు ఒప్పందం చేసుకున్నట్లయితే చక్కటి పంటలను మీరు పండించవచ్చు. అశ్వగంధ తో పాటు మరిన్ని ఔషధ మొక్కలను కూడా పెంచుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.

Latest Videos

click me!