మీకు పెట్టుబడి లభించడం లేదా అయితే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అందిస్తున్న ముద్ర రుణాలను ఉపయోగించుకొని చక్కని వ్యాపారం ప్రారంభించవచ్చు ముద్ర రుణాలను మీ ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ బ్యాంకులు అందిస్తున్నాయి ఈ ముద్రా రుణాలను ఎలాంటి హామీ లేకుండానే పొందే వీలుంది. బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చి చూసినట్లయితే ముద్ర రుణాలపై చెల్లించే వడ్డీ చాలా తక్కువ మీరు ప్రతి నెల వాయిదాల పద్ధతిలో వడ్డీ అసలు రెండు కలిపి జమ చేయవచ్చు తద్వారా మీరు సులభంగానే ఈ రుణం తీర్చవచ్చు.
ఇప్పుడు మీరు ఏ వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే స్టేషనరీ షాపు పెట్టుకోవడం ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. స్టేషనరీ షాపు కావాలంటే ముందుగా పాఠశాలలో కాలేజీలు అలాగే కార్యాలయాలు దగ్గరలో ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుంటే మంచిది. ఎక్కువగా విద్యార్థులు స్టేషనరీ షాపులను సందర్శిస్తూ ఉంటారు ముఖ్యంగా పుస్తకాలు పెన్నులు కాగితాలు లాంటివి కొనుగోలు చేసేందుకు ఎక్కువగా విద్యార్థులు స్టేషనరీ షాపులకు వెళుతూ ఉంటారు.
ముందుగా మీరు స్టేషనరీ షాప్ ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశం ఎంచుకున్న తర్వాత, ఈ ప్రదేశంలో ఏమేం వస్తువులకు డిమాండ్ అవసరం ఉందో తెలుసుకోండి. అనంతరం మీరు షాపును ప్రారంభించవచ్చు. ముందుగా సరుకుల పెట్టుబడి కోసం సుమారు 50 వేల రూపాయల వరకు ఖర్చవుతుంది. అనంతరం స్టేషనరీ షాపు కోసం అవసరం అనుకుంటే జిరాక్స్ మిషన్ కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు మీ సమీపంలో జిరాక్స్ కాపీలకు ఎక్కువగా డిమాండ్ ఉన్నట్లయితే మీరు జిరాక్స్ మిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. కాలేజీలు మున్సిపాలిటీ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కోర్టులు ఉన్నట్లయితే మీకు జిరాక్స్ మిషన్ చక్కగా ఉపయోగపడుతుంది.
జిరాక్స్ ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. అలాగే దానికి అనుబంధంగా లామినేషన్ మెషిన్, కూడా పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది. నోటుబుక్కులు, పెన్నులు, అదేవిధంగా ఇతర పుస్తకాలను మీరు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీటిని ఎమ్మార్పీ ధరకు విక్రయించుకున్న చక్కటి లాభం పొందే అవకాశం ఉంది. బ్రాండెడ్ వస్తువులకు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.
అలాగే స్కూల్స్ తో అనుబంధం ఏర్పాటు చేసుకొని, వారికి కావాల్సిన పుస్తకాలను మీరు షాపులో అందుబాటులో పెట్టుకుంటే మంచి బిజినెస్ లభించే అవకాశం ఉంది. అలాగే స్టేషన్ అనేది షాప్ తో పాటు కూల్డ్రింకులను కూడా అందుబాటులో ఉంచుకుంటే వేసవికాలంలో చక్కటి బిజినెస్ అవుతుంది.
స్టేషనరీ షాప్ లో మొబైల్ రీఛార్జ్ లను కూడా అందుబాటులో ఉంచుకుంటే మంచిది తద్వారా అదనపు ఆదాయం పొందే వీలుంది. స్టేషనరీ షాపులో సరుకును మార్కెట్లో తక్కువ ధర ఉన్నప్పుడే అన్ సీజన్లోనే కొనుగోలు చేస్తే మంచిది. తద్వారా సీజన్లో మీరు ఇబ్బందులు ఎదుర్కోరు. ఇక చివరగా స్టేషనరీ షాప్ నుంచి ఆదాయం విషయానికి వస్తే మీ బిజినెస్ ను బట్టి నెలకు 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించి అవకాశం ఉంది.