Business Ideas: మహిళలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటివద్దే నెలకు రూ. 50 వేల వరకూ సంపాదించే అవకాశం..

First Published | Jun 4, 2023, 11:01 PM IST

మహిళలు మీరు ఇంటి వద్ద ఉండి వ్యాపారం చేయాలని భావిస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా ద్వారా మీరు మీ కలలను సాకారం చేసుకోవచ్చు. . ఈ బిజినెస్ కోసం మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కేవలం మీ ఇంట్లో రెండు గదులను కేటాయిస్తే చాలు చక్కటి బిజినెస్ మీరు చేసే అవకాశం ఉంది అంతేకాదు ప్రతినెల మంచి మొత్తంలో డబ్బు కూడా సంపాదించవచ్చు ప్రస్తుతం ఆ బిజినెస్ ప్లాన్ ఏంటో మనం తెలుసుకుందాం. 

ప్రస్తుతం నగరాల్లో వర్కింగ్ కల్చర్ బాగా పెరిగిపోయింది భార్యాభర్త ఇరువురు ఉద్యోగానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో చూసుకోవడం అనేది ఒక పెద్ద సవాలు అనే చెప్పాలి.  అయితే పిల్లలను  కాస్త పెద్ద వాళ్ళు అయితే స్కూళ్లకు వెళ్ళిపోతారు అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు.  కానీ చంటి పిల్లలు చిన్న పిల్లలను చూసుకోవడమే పెద్ద సమస్య అని చెప్పాలి.  దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశం గా మార్చుకోవచ్చు.  బేబీ కేర్ సెంటర్ ప్రారంభించడం ద్వారా ఎంత లాభం పొందవచ్చు ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం

బేబీ కేర్ సెంటర్ కోసం ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.  మీ ఇంట్లోనే రెండు గదులను పిల్లలను చూసుకునేందుకు ఏర్పాటు చేసుకుంటే మంచిది. . మీ ఇల్లు సరిపోకపోతేమరో ఇంటిని అద్దెకు తీసుకొని కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది. . మీ సామర్థ్యాన్ని బట్టి పిల్లలను చూసుకోవాలి ఉదయం నుంచి సాయంకాలం వరకు పిల్లలను చూసుకోవాల్సి ఉంటుంది వీలైతే కొంతమంది తల్లిదండ్రులు పొద్దుపోయే వరకు ఆఫీసు పనులు ఉంటాయి అలాంటి వారిని కూడా చూసుకుంటే మంచిది తద్వారా మీరు అదనపు ఆదాయంకుండా పొందే అవకాశం ఉంది. 
 


ముఖ్యంగా పిల్లలను చూసుకునేందుకు బేబీ కేర్ సెంటర్ లో బొమ్మలు,  బెడ్స్,  ఉయ్యాలలు,  అవసరం అవుతాయి.  అవసరం అనుకుంటే సహాయకులను కూడా చేర్చుకుంటే మంచిది. . ముఖ్యంగా మీరు బేబీ కేర్ సెంటర్ ప్రారంభించినట్లు స్థానికంగా ఉందా కుటుంబాలకు తెలియజేసేందుకు పాంప్లెట్స్ ద్వారా  ఇన్ఫర్మేషన్ తెలుపవచ్చు.  అలాగే న్యూస్ పేపర్ లో ఆడ్ ఇవ్వడం ద్వారా కూడా మీరు బేబీ కేర్ సెంటర్ గురించి పబ్లిసిటీ చేయవచ్చు. 
 

ఇంకా ఎక్కువగా వర్కింగ్ ఫ్యామిలీ లు ఉన్న దగ్గరే  బేబీ కేర్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. . ఉదాహరణకు టౌన్ షిప్స్, కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలో అయితే బాగా వర్క్ అవుట్ అవుతుంది. 
 పిల్లలకు ఆహారం కోసం తల్లిదండ్రులకు సంప్రదిస్తే మంచిది. తల్లిదండ్రులు సూచన మేరకే పిల్లలకు ఆహారం తినిపించాల్సి ఉంటుంది.  అలాగే తల్లిదండ్రుల  ఫోన్ నెంబర్లను మీ వద్ద ఎప్పటికీ ఉంచుకోవాలి. 

పిల్లలను ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండేలా గదులను ప్రతిరోజు శుభ్రం చేయాలి. అత్యవసరమైన మందులు,  ఆహార పదార్థాలను కూడా దగ్గర ఉంచుకుంటే మంచిది, ఇక బేబీ కేర్ సెంటర్ చార్జెస్ విషయానికి వస్తే.  మీరు కల్పిస్తున్న సౌకర్యాలను బట్టి చార్జెస్ సేకరిస్తే మంచిది.  సీసీ కెమెరా సౌకర్యం కూడా వెంట ఉంచుకుంటే మంచిది.  

Latest Videos

click me!