ఫుడ్ బిజినెస్ విషయానికి వస్తే ఈ బిజినెస్ లో క్వాలిటీ అలాగే రుచి మెయింటైన్ చేస్తే మాత్రం చక్కటి లాభం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓపెన్ చేసినట్లయితే చక్కటి లాభం పొందవచ్చు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కోసం మీరు ఎంత పెట్టుబడి పెట్టాలి అలాగే ఏమేం మెనూ తయారు చేసుకోవాలి అలాంటి విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్, ఇటాలియన్ ఫాస్ట్ ఫుడ్, నార్త్ ఇండియా వంటకాలు, అలాగే కాంటినెంటల్ రుచులు చూసేందుకు యువత ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు ఒక మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే చక్కటి లాభం పొందే అవకాశం ఉంది.
యువత ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్, ఇటాలియన్ ఫాస్ట్ ఫుడ్, నార్త్ ఇండియా వంటకాలు, అలాగే కాంటినెంటల్ రుచులు చూసేందుకు యువత ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు ఒక మంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటే చక్కటి లాభం పొందే అవకాశం ఉంది.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కోసం మీరు ముఖ్యంగా నగరంలోని ఓ మంచి సెంటర్ ను ఎంపిక చేసుకోవాలి. మీరు ఎంపిక చేసుకున్న సెంటర్ సమీపంలో కాలేజీలు, ఆఫీసులు, ఇతర విద్యాసంస్థలు ఉంటే చక్కటి లాభం పొందే అవకాశం ఉంది. అలాగే మీ బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లే అవకాశం ఉంది.
ముందుగా షాపును మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు తగ్గట్టుగా మలుచుకోవాల్సి ఉంటుంది. కిచెన్, బిల్లింగ్ కౌంటర్, సీటింగ్ అరేంజ్మెంట్స్ చేయడం ద్వారా మీరు మంచి వ్యాపారం చేసే వీలు కలుగుతుంది. అలాగే కస్టమర్లను కూడా ఎట్రాక్ట్ చేయవచ్చు. మీరు ప్రారంభ పెట్టుబడి కింద రెండు లక్షల నుంచి 5 లక్షల వరకు పెట్టుబడి పెట్టి కిచెన్ ఏర్పాటు చేసుకుంటే మంచిది. . ఎందుకంటే మీరు చేసే ఫాస్ట్ ఫుడ్ నాణ్యతలోనూ, రుచిలోనూ ఏమాత్రం తగ్గకూడదు అంటే, మీరు కిచెన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాగే మీరు ఉపయోగించే పాత్రలను క్లీనింగ్ చేసుకోవడానికి ప్రత్యేక స్థలం ఉండేలా చూసుకోవాలి, నీటి సదుపాయం పుష్కలంగా ఉండేలా జాగ్రత్త పడాలి. . అలాగే వీలైతే ఆర్ ఓ ప్లాంట్ ను కూడా మెయింటైన్ చేయడం ద్వారా మీరు కస్టమర్లకు శుభ్రమైన మంచినీటిని సరఫరా చేయవచ్చు.
ఇక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కు కావాల్సిన వంట సామాన్ల కోసం మీరు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేస్తే మంచిది. . వీటికోసం పెట్టుబడి ఒక లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకు అవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కూడా పెట్టుకుంటే మీరు ఇంధనం కోసం పరుగులెత్తాల్సిన పని ఉండదు.
ఇక మెనూ విషయానికి వచ్చినట్లయితే చైనీస్ నూడుల్స్, వెజ్ నాన్ వెజ్ వంటకాలు, పిజ్జా బర్గర్, ఫ్రైడ్ రైస్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అందుబాటులో ఉంచినట్లయితే, మీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చక్కగా రన్ అవుతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కు మొత్తం పెట్టుబడి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టవచ్చు. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ చేసినట్లయితే, తక్కువ పెట్టుబడి లోనే స్ట్రీట్ ఫుడ్ స్టైల్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏర్పాటు చేయవచ్చు అప్పుడు మీకు పెట్టుబడి ఒక లక్ష నుంచి రెండు లక్షలు మాత్రమే అవుతుంది.
ఇక ఆదాయం విషయానికి వచ్చినట్లయితే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మీద కనీసం నెలకు ఒక లక్ష నుంచి 2 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ముద్రా రుణాలు కూడా ఉపయోగించుకోవచ్చు. తద్వారా మీరు ఎలాంటి హామీ లేకుండానే రుణాలను పొందే అవకాశం కలుగుతుంది.