Gold Rate: ఆషాఢం వచ్చేస్తోంది.. బంగారం ధర ఏకంగా రూ. 50 వేల దిగువకు వచ్చే చాన్స్,..కారణం తెలిస్తే ఆనందిస్తారు..

First Published | Jun 11, 2023, 10:32 AM IST

ఆషాడం వచ్చేస్తోంది,  పెళ్లిలో సీజన్ కూడా ఎండింగ్ కు వచ్చేసింది.  ఇక బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  అయితే ఈసారి బంగారం ధరలు ఏకంగా 50 వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని బులియన్  పండితులు అంచనా వేస్తున్నారు. మరి అందుకు గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆషాడం ప్రారంభం కాబోతోంది జూన్ 18 నుంచి ఆషాడం సీజన్ మొదలవుతోంది.  ఈ నెలలో బంగారం ధర తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ లేకపోవడం వల్ల బంగారం ధర భారీగా పడే అవకాశం ఉందని దేశీయంగా కారణాలు చెబుతున్నారు.  అయితే అంతర్జాతీయంగా కూడా వాళ్ళు కారణాలవల్ల బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే బంగారం ధర దేశీయంగా 50 వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని బులియన్ పండితులు అంచనా వేస్తున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

 పసిడి ధరలు మే నెలలో అమెరికాలో ఒక ఔన్స్ ( 31 గ్రాములు) ధర గరిష్టంగా 2030 డాలర్లు పైన పలికింది. కాగా జూన్ నెల ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర  అమెరికాలో ఒక ఔన్స్ ( 31 గ్రాములు)  1930 డాలర్లకు  పడిపోయింది. అంటే సుమారు 100 డాలర్లు తగ్గింది.  ఈ నేపథ్యంలో దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 


 ముఖ్యంగా అమెరికాలోని రుణ సంక్షోభం నుంచి ప్రభుత్వం గట్టెక్కిందని దీంతో మళ్లీ బాండ్స్ మార్కెట్లో గిరాకీ పెరిగిందని చెబుతున్నారు.  ఫలితంగా మధుపరులు అమెరికన్ బాండ్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలోని  న్యూయార్క్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజిలో  బంగారం ఫ్యూచర్లపై అంచనాలు తగ్గుతున్నాయి.  ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 

 ఇదిలా ఉంటే భవిష్యత్తులో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.  ప్రస్తుతం దేశీయంగా బంగారం ధర 60000 పైగా ఉంది 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  ఢిల్లీ మార్కెట్లో రూ. 60300 గా ఉంది. ఇది త్వరలోనే 60000 దిగువకు వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  ఇక దేశీయంగా హైదరాబాదులో సైతం బంగారం ధర తగ్గి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 

కాగా భవిష్యత్తులో గమనించినట్లయితే పసిడి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా దేశీయంగా స్పాట్ బంగారం ధరలు 50 వేల స్థాయికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.  గతంలో బంగారం ధరలు అంతర్జాతీయ కారణాల కారణంగా భారీగా తగ్గుతూ వచ్చాయి కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల దృష్ట్యా పసిడి ధరలు వరుస పతనం కనిపించే అవకాశం ఉందని చెబుతున్నారు. 

ముఖ్యంగా అమెరికన్ యూఎస్ బాండ్ యీల్డ్స్ పెరగడం కూడా బంగారం ధర తగ్గి రావడానికి ఒక ప్రధాన కారణంగా చెబుతున్నారు.  ఇక దేశీయంగా గమనించినట్లయితే ఆషాడమాసంలో పెళ్లిళ్ల సీజన్ కాకపోవడం వల్ల పసిడి ధరలు తగ్గి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అన్నీ కలిసి వస్తే పసిడి ధరలు ఈ సంవత్సరం చివరి నాటికి 50 వేల దిగువకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. 

గమనిక:  బంగారం ధరలు మార్కెట్లో  హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటాయి పైన పేర్కొన్న ధరలు అంచనాలు మాత్రమే.  మీరు  ఆభరణాలు కొనుగోలు చేసే ముందు ధర తెలుసుకుంటే మంచిది. బంగారం ధరలు నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి.
 

Latest Videos

click me!