Breaking News: మహిళలకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన బంగారం ధర...తులం పసిడి ధర ఎంత తగ్గిందో తెలుసుకోండి..

First Published Sep 28, 2022, 6:49 PM IST

మీరు కూడా ఈ పండుగ సీజన్‌లో తక్కువ ధరకు బంగారాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నరా, అయితే అందుకు  ఇది మంచి అవకాశం. బుధవారం బంగారం ధర భారీగా తగ్గింది. డిమాండ్ బలహీనమైన నేపథ్యంలో స్పెక్యులేటర్లు తమ పొజిషన్స్ తగ్గించుకోవడంతో ఫ్యూచర్స్ మార్కెట్‌లో బంగారం ధర బుధవారం రూ.435 తగ్గి 10 గ్రాములకు రూ.49,282కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గిన తర్వాత బుధవారం దేశ రాజధాని ఢిల్లీలోని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.435 తగ్గి రూ.49,282కి చేరుకుంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ అందించిన సమాచారం ప్రకారం క్రితం ట్రేడింగ్ సెషన్‌లో పసిడి మెటల్ 10 గ్రాముల ధర రూ.49,717 వద్ద ముగిసింది. వెండి కూడా కిలో రూ.1,600 తగ్గి రూ.54,765కి చేరుకుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,615.7 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, వెండి ధర ఔన్స్‌కు 18 డాలర్లుగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ మాట్లాడుతూ, "ఇన్వెస్టర్లు విముఖత కారణంగా, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు స్పాట్ డిమాండ్ 435 రూపాయలు తగ్గింది.

ఆభరణాలకు డిమాండ్ పెరగవచ్చు

పండుగల సీజన్‌లో ఈ రెండు లోహాల ధరలు తక్కువగా ఉండడంతో ఆభరణాలకు డిమాండ్ పెరగవచ్చు. అయితే ప్రస్తుతం బంగారం, వెండి ధరలు గత రెండేళ్లతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. వాస్తవానికి ఈ ధర సెప్టెంబరు 2020 కంటే ఈరోజు చాలా తక్కువగా ఉంది.
 

ఇక బంగారం ధరల గురించి, అంతర్జాతీయంగా చూసినట్లయితే పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడంతో చాలా మంది ఇన్వెస్టర్లు యూఎస్ బాండ్స్ కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.  దీంతో పసిడిపై ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోయింది. 30 రోజుల పసిడి ధరలు పరిశీలించినట్లయితే ఔన్సు బంగారం ధర 101 డాలర్లు తగ్గింది. అలాగే బంగారం ధర ప్రస్తుతం 1670 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గడచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే ఒక ఔన్సు 280 డాలర్లు తగ్గింది.

ఇక దేశీయంగా చూసినట్లయితే, బంగారం ధరలు ప్రస్తుతం 50 వేల సమీపంలో  ట్రేడవుతున్నాయి. అయితే పసిడి ధరలు  2020 తో పోల్చి చూసినట్లయితే, ప్రస్తుతం ఆరువేల రూపాయలు తక్కువగా పలుకుతోంది.  2020లో పసిడి ధర గరిష్టంగా 56,000 పలికింది.  అక్కడినుంచి ప్రస్తుతం 50 నుంచి 51 వేల మధ్యలో ఉంది.  అయితే భారత దేశంలో ప్రస్తుతం ఫెస్టివల్ సీజన్ నడుస్తోంది. దసరా, దీపావళి, ధన త్రయోదశి ఈ నేపథ్యంలో  బంగారం కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో పసిడి ధరలు దేశీయంగా స్థిరంగా ఉంటాయి. అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

click me!