Business Ideas: కేవలం రూ. 50 వేల పెట్టుబడితో ఈ బిజినెస్ చేస్తే, కనీసం రోజుకు రూ. 10 వేల వరకూ సంపాదించే చాన్స్

First Published Dec 22, 2022, 1:11 PM IST

యువకులారా నిరుద్యోగంతో సతమతమవుతున్నారా,  మీ చదువుకు తగిన ఉద్యోగం లభించలేదని బాధపడుతున్నారా,  ఆదాయం కూడా ఏమాత్రం మిగలడం లేదని ఆందోళన చెందుతున్నారా.  అయితే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకండి వెంటనే,  ఓ మంచి వ్యాపారం ప్రారంభించి, మీ కెరీర్ బిల్డ్ చేసుకోండి. 

ఈ మధ్యకాలంలో ఫుడ్ బిజినెస్ లో మించిన వ్యాపారం లేదు,  ఎందుకంటే ఈ మధ్యకాలంలో వీక్ అండ్ కల్చర్ అన్నది పెరిగిపోయింది.  సాయంకాలం పూట భార్యా పిల్లలతో ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వెళ్లి వెరైటీ రుచులను చూసేందుకు,  జనం ఎక్కువగా అలవాటు పడుతున్నారు.  మీరు కూడా దీన్నే వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. 
 

 చాట్ ఐటమ్స్ లో  పావ్ బాజీ అనేది  పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే వంటకం. ఇది మహారాష్ట్రకు చెందిన వంటకం అయినప్పటికీ,  ప్రస్తుత కాలంలో అందరూ దీన్ని ఇష్టపడుతున్నారు. మెత్తటి పావ్ బన్నుల్లో  మసాలా కూర ను నంజుకుని తింటే ఆ టేస్టే వేరు అని చాలా మంది చెబుతుంటారు.  వర్షాకాలంలో  చల్లటి వాతావరణం ఉన్నప్పుడు ఈ పావ్ భాజీ తినేందుకు జనం ఎక్కువగా ఇష్టపడతారు. 
 

అయితే మీరు కూడా పావు బాజీ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే, కొద్దిగా పెట్టుబడి పెడితే సరిపోతుంది. కనీస పెట్టుబడి 50 వేల తో ఈ వ్యాపారాన్ని మీరు ప్రారంభించవచ్చు. ముందుగా ఒక షాపును రెంటుకు తీసుకోవాలి, లేదా ఒక స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసుకున్నా సరిపోతుంది. ఒక కమర్షియల్ గ్యాస్ స్టవ్ అవసరం పడుతుంది.  అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కూడా సరిపోతుంది.
 

ఇక అన్నిటి కన్నా ముఖ్యమైనది మీరు బిజినెస్ ఏర్పాటు చేసుకున్న ప్రదేశం. ఎమ్యూజ్ మెంట్ పార్కులు, కాలేజీలు, జన సమర్థం ఎక్కువ ఉండే ప్రదేశాల్లో అయితే మీకు చక్కగా వర్కౌట్ అవుతుంది. అంతేకాదు మీ చాట్ పాయింట్ మరింత విస్తరించేందుకు అవకాశం కూడా ఉంటుంది. 
 

pav bhaji

ఇంక  పావ్ బాజీ సెంటర్ కోసం, మీకు కావాల్సింది వంటమనిషి, కానీ మీరే స్వయంగా పావ్ బాజీ తయారు చేయడం నేర్చుకుంటే మంచిది.  తద్వారా మీ డబ్బు ఆదా అవుతుంది. ఇద్దరు అన్ స్కిల్డ్ సహాయకులను పెట్టుకుంటే సరిపోతుంది.  మీరు తెలుసుకోవాలి అనుకుంటే,  హోటల్ మేనేజ్మెంట్ సంస్థలు,  అలాగే కలినరీ ఆర్ట్స్ సంస్థలు, షార్ట్ టర్మ్ కోచింగ్ కు ఇచ్చి ఇలాంటి వెరైటీ వంటకాలను  చేయడంలో శిక్షణను అందిస్తున్నాయి. 

ఇక pav bhaji అత్యంత అవసరమైనది,  పావ్ బన్నులు, వీటిని మనం స్థానిక బేకరీ నుంచి కొనుగోలు చేసుకుంటే మంచిది. డిమాండ్ ను బట్టి ఈ పావ్ బన్నులను స్టోర్ చేసుకోవాలి. అలాగే తాజా మసాలా దినుసులను కూడా ఎప్పటికప్పుడు హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి పావ్ బాజీ  మసాలా తయారు చేసుకుంటే మంచిది. తద్వారా మీకు ఖర్చు కలిసి వస్తుంది.  నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దు.  అప్పుడే కస్టమర్లు  పదేపదే వస్తారు. ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లో పావ్ భాజీ వ్యాపారులు ప్రతి రోజు కనీసం రూ. 10 వేల వరకూ సంపాదిస్తున్నారు. 
 

click me!