BFSI ఇన్‌సైట్ సమ్మిట్ 2022లో RBI గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, “క్రిప్టోకరెన్సీలు వ్యవస్థను అంతరాయం కలిగించడానికి, వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. క్రిప్టో కరెన్సీలకు నియంత్రణ ఉండదని, అలాగే, ఇది ఏ మంచి ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడదని, ఇది 100 శాతం ఊహాజనితమైనదని, క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నారు.