Business Ideas: కేవలం రూ. 2లక్షలు పెట్టుబడి పెడితే చాలు, ఉన్న ఊరిలో నెలకు రూ. 1 లక్ష సంపాదన మీ సొంతం...

First Published Jan 25, 2023, 4:58 PM IST

బిజినెస్ చేయడమే మీ లక్ష్యమా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా గురించి ప్రస్తుతం తెలుసుకుందాం ఈ బిజినెస్ చేయడం ద్వారా యువత తమ ఉంటున్న ఊర్లోనే మంచి ఆదాయం సంపాదించే అవకాశం ఉంది.  అంతేకాదు కేవలం కొద్ది గంటలు కష్టపడితే చాలు ఈ బిజినెస్ ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది అలాంటి బిజినెస్ ఏంటో ప్రస్తుతం తెలుసుకుందాం. 

.ప్రస్తుతం సాంబ్రాణి కప్స్ వ్యాపారం బాగా సాగుతోంది ప్రతి ఇంట్లోనూ పూజ  చేసే సమయంలో అగరబత్తులు ముట్టించడం ఆనవాయితీ.  అయితే ఈ మధ్యకాలంలో సాంబ్రాణికప్స్ ధూపం వెలిగిస్తున్నారు సాంబ్రాణివాసన ఆరోగ్యానికి మంచిది కావడం వల్ల చాలామంది సాంబ్రాణికప్స్ వాడకం పెంచుతున్నారు దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశం గా మార్చుకునే వీలుంది. 

ముఖ్యంగా సాంబ్రాణి కప్స్ వాసన చాలా బాగుంటుంది అందుకే కస్టమర్లు ఎక్కువగా వీటిని కొనుగోలు చేస్తున్నారు గతంలో సాంబ్రాణి పొగ వేయాలంటే బొగ్గులు రాజేసి దానిపై సాంబ్రాణి పొడిచాలేవారు అయితే ఇది చాలా పెద్ద ప్రాసెస్ అందుకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం మార్కెట్లో ఈ సాంబ్రాణి కప్స్ వచ్చేసాయి.  మీరు కూడా సాంబ్రాణికప్స్ తయారు చేయాలనుకుంటే ఈ వ్యాపారానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తద్వారా ఉన్న ఊరిలోనే చక్కటి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 

సాంబ్రాణి కప్స్ తయారీకి ముందుగా మీరు ఒక సాంబ్రాణి మేకింగ్ మిషన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది దీని ధర సుమారు రెండు లక్షల వరకు ఉంటుంది ఇండియా మార్ట్ వెబ్సైట్ ప్రకారం ఈ సాంబ్రాణి కప్స్ మేకింగ్  మెషిన్ ధర సుమారు రెండు లక్షల రూపాయల వరకు ఉంది.  అంతేకాదు సాంబ్రాణికప్స్ తయారీ యంత్రం ఆన్లైన్ ద్వారా కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. 

 సాంబ్రాణి కప్స్ మేకింగ్ మిషన్ కొనుగోలు చేసిన తర్వాత మీరు సాంబ్రాణి కప్స్ మేకింగ్  విధానంపై కొద్దిగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడే మీరు సాంబ్రాణి కప్స్ ను సులభంగా తయారు చేయగలరు.  అలాగే నాణ్యమైన సాంబ్రాణి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.  ప్యాకింగ్ కోసం మరో చిన్న యంత్రం కూడా కొనుగోలు చేస్తే సరిపోతుంది.  ఇక మీరు ఏర్పాటు చేసుకున్న బ్రాండ్  లోగో కనబడేలా ఆకర్షణీయంగా ప్యాక్ చేస్తే సేల్స్ చక్కగా అవుతాయి. 

ఇక మార్కెటింగ్ చాలా ముఖ్యం.  మీరు నేరుగా కూడా ప్యాక్ చేసి ఓ షాపు రెంటుకు తీసుకొని వీటిని విక్రయించవచ్చు తద్వారా ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది.  దాంతోపాటు ముఖ్యంగా పూజా సామాన్లు అమ్మే షాపులకు హోల్సేల్గా విక్రయిస్తే  మీకు ఆర్డర్లు పెరిగే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా కార్తీకమాసము అయ్యప్ప స్వాముల  దీక్షలు సమయంలో సాంబ్రాణి కప్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. 

అలాగే మీ బ్రాండ్ ను ప్రచారం చేసుకునేందుకు షాపుల వద్ద బ్యానర్లు గ్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయిస్తే సులభంగా మీ బ్రాండ్ ప్రజల్లోకి వెళుతుంది.  ఆన్లైన్ షాపింగ్ పద్ధతి ద్వారా కూడా ఫ్లిప్కార్ట్ అమెజాన్ వంటి వెబ్సైట్లో కూడా మీరు వీటిని సామ్రాణికప్స్ ను అందుబాటులో ఉంచవచ్చు తద్వారా ఆన్లైన్ ద్వారా కూడా మీరు డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది.  

click me!