ఇందుకు పెట్టుబడి కూడా పెద్దగా అవసరం లేదు. ఒక ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేయడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే వీలుంది. ముఖ్యంగా బర్గర్ ధర పై మనకు లాభం చాలా వస్తుంది. అది ఎలాగో తెలుసుకుందాం. బర్గర్ తయారీకి వాడేది ప్రధానంగా ఒక బన్, దీని ధర కేవలం రూ. 5 మాత్రమే ఉంటుంది. దీని మధ్యలో పచ్చి కూరగాయలు, అలాగే ఒక వండిన కూర, రెండు రకాల సాస్ లు, అలాగే మయనేజ్ చీజ్ ముక్క వేస్తారు. దీని తయారీకి మనకు అయ్యే ఖర్చు. కేవలం రూ. 20 మాత్రమే కానీ బేకరీల్లో బర్గర్ ధర కనిష్టంగా రూ.50 నుంచి గరిష్టంగా రూ.150 వరకూ ఉంటుంది.