బిజినెస్ ఐడియా: జాబ్ చేసినా డబ్బులు సరిపోవడం లేదా, అయితే రోజుకు 2 గంటలు కష్టపడితే చాలు...నెలకు లక్షల్లో ఆదాయం

First Published Sep 9, 2022, 7:27 PM IST

బిజినెస్ ఐడియా: ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బులు సరిపోవడం లేదా, అయితే కచ్చితంగా మీ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. ఇందుకోసం మీరు రోజు మొత్తంలో ఓ రెండు గంటల సమయం వెచ్చిస్తే సరిపోతుంది. మరి అలాంటి వ్యాపారాలు ఏమున్నాయో తెలుసుకుందాం. 

ప్రస్తుత కాలంలో ఖాళీ సమయాన్ని వృధా చేసుకునే బదులు, డబ్బు సంపాదన మీద పెడితే మీకు చక్కటి ఆదాయం సొంతం అవుతుంది. పెరుగుతున్న ఖర్చుల రీత్యా ఈ డబ్బు మీకు సహాయపడుతుంది. అంతేకాదు మీకు అదనపు ఆదాయం చేకూర్చుతుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుందాం. 

హోం ట్యూషన్స్ : మీరు ఏదైనా సబ్జెక్టులో అకడమిక్ గా మంచి పట్టు సాధిస్తే మాత్రం చక్కగా హోం ట్యూషన్స్ చక్కటి ఆదాయ మార్గం. మీరు ఉండే ఇంట్లోనే హోం ట్యూషన్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రతి నెలా డబ్బు సంపాదన చేసుకోవచ్చు. అలాగే నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి కూడా హోంట్యూషన్ చెప్పడం ద్వారా మరింత ఎక్కవ ఆదాయం పొందవచ్చు. అలాగే ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా కూడా మీరు మంచి ఆదాయం పొందే వీలుంది. 

నర్సరీ: మీకు సొంత స్థలం ఉంటే అందులో నర్సరీ ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు. ఇందుకోసం మీరు ఒక సహాయకుడిని పెట్టుకొని మొక్కలు పెంచితే సరిపోతుంది. అలాగే సాయంకాలం, ఉదయం సమయంలో ఓ రెండు గంటల పాటు మీరు గార్డెనింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు మొక్కలను విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది. 

ఆన్ లైన్ జాబ్స్ : ప్రస్తుతం ఇంటర్నెట్ లో పలు వెబ్ సైట్స్ ఆన్ లైన్ ద్వారా పలు ఫ్రీలాన్స్ వర్క్ లను ఆఫర్ చేస్తున్నాయి. వాటిని మీరు నిబంధనల మేరకు చేసి డబ్బులు పొందవచ్చు. అలా చేయడం ద్వారా కూడా మీరు మంచి ఆదాయం పొందవచ్చు. మార్కెట్లో fiverr, ఫ్రీలాన్సర్, అప్ వర్క్ లాంటి వెబ్ సైట్స్ ద్వారా మీరు పనులు పొందడంతో పాటు, ఆదాయం పొందే వీలుంది. 

ఆర్టిఫిషియల్ జువెలరీ: ఎన్ని వ్యాపారాలు వచ్చినా కృత్రిమ ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదు. మీరు కేవలం రూ. 25,000లో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఆన్‌లైన్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇది మంచి వ్యాపార ఆలోచన అని నిపుణులు అంటున్నారు. మీరు దీన్ని చిన్న స్థాయి నుంచి ఇంటి వద్దే ప్రారంభించవచ్చు. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు పొందడం ద్వారా సంపాదించుకోవచ్చు. 

పిండి వంటలు, పచ్చళ్లు: ప్రస్తుతం ఆన్ లైన్ యుగంలో మీరు ఇంటి వద్దే పిండి వంటలు, పచ్చళ్లను తయారు చేసి, ప్యాకింగ్ చేసుకోవాలి. ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లను సేకరించి జొమాటో, లేదా స్విగ్గీ ద్వారా మీరు ఆహార పదార్థాలను కస్టమర్లకు చేరవేయవచ్చు. 

click me!