Business Ideas: ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నెలకు కూర్చున్న చోటే రూ. 2 లక్షలు సంపాదించే బిజినెస్ ఇదే..

First Published Apr 27, 2023, 1:10 PM IST

నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూసి సమయం వృధా చేసుకునే బదులు ఓ చక్కటి బిజినెస్ ఐడియా వాడుకొని హాయిగా జీవితంలో  సెటిల్ అయిపోవచ్చు. కేవలం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ ను మీరు చేస్తున్నట్లయితే, ప్రస్తుతం మనం ఒక ఐడియాను డిస్కస్ చేద్దాం.  ఈ బిజినెస్ ప్లాన్ ద్వారా ప్రతినెల చక్కటి ఆదాయం పొందే వీలుంది. 
 

యువతకు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం పట్ల స్పృహ బాగా పెరిగింది దీంతో జిమ్ లో కండలు పెంచేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  ముఖ్యంగా పోలీసు ట్రైనింగు ప్రిపేర్ అయ్యేవారు,  అలాగే మిలటరీ లో జాయిన్ అవ్వాలని ట్రై చేస్తున్న వారు కూడా జిమ్ లో కసరత్తులు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.  దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా తీసుకుంటే చక్కటి ఆదాయం పొందే వీలుంది.  మీరు ఉంటున్న గ్రామం లేదా పట్టణం నగరంలోనే జిమ్ ను ఏర్పాటు చేయడం ద్వారా చక్కటి ఆదాయం పొందవచ్చు.  అయితే  జిమ్ ఏర్పాటుకు ఎంత పెట్టుబడి పెట్టాలి ఏమేం వస్తువులు కావాలి. ఎలాంటి బిజినెస్ ప్లాన్ ను అమలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

జిమ్  ఏర్పాటు చేయాలంటే ముందుగా కావాల్సింది పెట్టుబడి. దీని కోసం మీరు ఏ ప్రైవేటు వ్యక్తుల వద్దను లేక మరో ఇతర సంస్థల వద్దను అప్పులు చేసి భారం పెంచుకోకండి. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముద్రా రుణాలను అందజేస్తోంది నిరుద్యోగ యువత ఈ ముద్రా రుణాలను అప్లై చేసుకోవడం ద్వారా 50వేల నుంచి పది లక్షల వరకు రుణాలను పొందే వీలుంది.  మీరు ఏ వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారానికి సంబంధించిన కంప్లైంట్ డీటెయిల్స్ రిపోర్ట్ సమర్పించడం ద్వారా మీరు ఏదైనా ప్రభుత్వ బ్యాంకు నుండి ఈ ముద్రా రుణాన్ని పొందవచ్చు.  ఎస్బిఐ సహా అన్ని ప్రభుత్వ బ్యాంకులో ముద్రా రుణాలను అందిస్తున్నాయి.  అన్ని బ్రాంచ్ల్లోనూ ఈ ముద్రా రుణాలు అందుబాటులో ఉంటాయి. . ఎలాంటి తనకా లేకుండానే మీరు ఈ ముద్ర రుణాన్ని పొందవచ్చు.  బయట ఇతర రుణాలతో పోల్చి చూసినట్లయితే, ఈ ముద్రా రుణాల్లో వడ్డీ చాలా తక్కువ.

సులభ వాయిదాలలో మీరు వడ్డీతో  పాటు అసలు చెల్లించవచ్చు.  అలాగే ముద్ర రుణాల ద్వారా మీరు భవిష్యత్తులో మరిన్ని రుణాలు పొందే అవకాశం ఉంది ఉదాహరణకు మీరు ఒక లక్ష రూపాయల రుణం తీసుకొని వ్యాపారం ప్రారంభించిన మరో మూడు లక్షల రూపాయలు రుణం పొందే వీలు దక్కుతుంది మీ వ్యాపారం అభివృద్ధి చెందే కొద్ది మీరు పొందే రుణం కూడా పెరుగుతూ ఉంటుంది అయితే సకాలంలో రుణాలు చెల్లించిన వారికి మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు. 
 

ఇక  జిమ్ విషయానికి వస్తే  మీరు హర్యానాలోని రోహ్ తక్, ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ప్రాంతాల్లో ఈ జిమ్ ఎక్విప్ మెంట్ తయారీ కంపెనీలు అధిక సంఖ్యలో ఉంటాయి. వీటి ద్వారా మీరు నేరుగా మీకు కావాల్సిన మీరు ఏర్పాటు చేయదలచుకున్న జిమ్ ఎక్విప్మెంట్ ను కొనుగోలు చేయవచ్చు.  నేరుగా మ్యానుఫ్యాక్చరర్ వద్దే కొనుగోలు చేసినట్లయితే, మీకు ధర తక్కువ వస్తుంది. ఆన్లైన్ ద్వారా మీరు ఎక్విప్మెంట్ కొనుగోలు చేసి ట్రాన్స్ పోర్ట్ చార్జీలు చెల్లిస్తే సరిపోతుంది. మీకు ఒక సాధారణ జిమ్ ఏర్పాటు చేసేందుకు 3 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకూ ఖర్చు అవుతుంది. మీరు జిమ్  ఏర్పాటు చేసుకునే స్థలం. పై అంతస్థులో ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా మీకు అద్దె తగ్గుతుంది. మీకు సొంత ఇల్లు ఉంటే పై అంతస్తును జిమ్ కోసం కేటాయించవచ్చు. 
 

జిమ్  ఏర్పాటు చేసిన తర్వాత మీరు ముందుగా చక్కటి పబ్లిసిటీ చేసుకుంటే మంచిది. అన్ని న్యూస్ పేపర్లు,  పాంప్లెట్లు  ద్వారా పబ్లిసిటీ చేసుకుంటే మీకు చక్కటి ఆదరణ లభిస్తుంది.  అదేవిధంగా మీరు  జిమ్ ఏర్పాటు చేశారు అనే విషయం ప్రజలకు తెలుస్తుంది.  ఇక జిమ్ విషయానికి వస్తే మీరు ప్రారంభంలో డిస్కౌంట్ ఆఫర్లు పెట్టడం ద్వారా ఎక్కువ మంది ఆసక్తి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది.  జిమ్ తో పాటు ఒక ఫ్రూట్ జ్యూస్ సెంటర్ కూడా పెట్టుకుంటే,  అదనంగా ఆదాయం లభించే అవకాశం ఉంది.  ఎందుకంటే జిమ్ కు వచ్చిన వాళ్ళు సేద తీరడానికి పళ్ళ రసాలను తాగుతుంటారు.  అందుకే మీరు జిమ్ ఏర్పాటు చేసిన తర్వాత,  పళ్ళ రసాలను అందుబాటులో పెడితే చక్కటి ఆదాయం పొందవచ్చు. జిమ్ అనేది వన్ టైం ఇన్వెస్ట్ మెంట్, కరెంటు బిల్లు, రూమ్ అద్దె, ఒక పనివాడిని పెట్టుకుంటే సరిపోతుంది. జిమ్ ద్వారా ప్రతి నెల ఖర్చులు పోనూ కనీసం రూ. 1 లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ సంపాదించుకోవచ్చు. 

నోట్: పైన పేర్కొన్న బిజినెస్ ఐడియా కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆదాయాలు, వ్యయం కేవలం అంచనా మాత్రమే. మీ పెట్టుబడులకు మీరే బాధ్యులు, ఏషియా నెట్ తెలుగు వెబ్ సైట్ ఎలాంటి బాధ్యత వహించదు.

click me!