Business Ideas: ఉద్యోగం లభించడం లేదా అయితే, రూ. 2 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా

First Published Feb 7, 2023, 12:13 PM IST

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా, ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగం లభించడం లేదా, అయితే వ్యాపారం చేయడం ద్వారా కూడా మీరు చక్కటి ఆదాయం సంపాదించే వీలుంది. అయితే తక్కువ పెట్టుబడితో  ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

వ్యాపారం చేయడం ద్వారా డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ అందుకు తగిన ప్రణాళిక సిద్ధం చేసుకోవడం చాలా కష్టం కొంతమందికి ప్రణాళిక సిద్ధంగా ఉన్నప్పటికీ పెట్టుబడి దొరకక వెనకడుగు వేస్తుంటారు అలాంటి వారి కోసమే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్రా రుణాలను తీసుకొచ్చింది ముద్రా రుణాల ద్వారా మీరు  మీ ప్రభుత్వం మీ సమీపంలోని ప్రభుత్వ బ్యాంకులో సులభంగా రుణాలను పొందవచ్చు. బయట ప్రైవేటు వడ్డీల కన్నా కూడా ముద్రా రుణాల వడ్డీ చాలా తక్కువ అలాగే కేవలం మీ వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం కోసం కూడా ఈ రుణాలను పొందే వీలుంది.

Vada Pav

ప్రస్తుతం ఒక మంచి ఫుడ్ బిజినెస్ గురించి తెలుసుకుందాం తద్వారా మీరు తక్కువ పెట్టుబడి తోనే ఎక్కువ లాభం సంపాదించే అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల ద్వారా ఈ మధ్యకాలంలో చాలామంది చక్కటి లాభాలలో ఆర్జిస్తున్నారు. అలాంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహారాష్ట్రలో అత్యంత ప్రాచుర్యం పొందిన వడపావ్ గురించి తెలుసుకుందాం.  ముంబై పూణే సహా భారత దేశంలోనే అనేక ప్రాంతాల్లో వడాపావు గురించి తెలియని వారు ఉండరు వడా పావ్ చాలా ఆరోగ్యకరమైన స్నాక్ అనే చెప్పాలి. మహారాష్ట్రలో ప్రతి వీధిలోను వడపావ్  సెంటర్లు ఉంటాయి. 
 

అయితే ఈ వడపావును తెలుగు రాష్ట్రాల్లో సైతం చాలా మంది రుచి చూసే ఉంటారు.  మీరు కూడా ఒక కొత్త తరహా ఫుడ్ బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే వడపావ్ సెంటర్ ప్రారంభిస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉంది ప్రస్తుతం మార్కెట్లో వడాపావు సెంటర్లను ఫ్రాంచైజీ రూపంలో సైతం అందిస్తున్నారు అటువంటి ఫ్రాంచైజీలో  పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. 

Vada Pav

ప్రస్తుతం మార్కెట్లో  అనేక వడపావ్ ఫ్రాంచైజీలో అందుబాటులో ఉన్నాయి.  వీటిలో కావాల్సిన పెట్టుబడి ఎంతో ముందుగా మీరు తెలుసుకోవాలి ఫ్రాంచైజీలో మీరు ఒకసారి పెట్టుబడి పెడితే చాలు మెటీరియల్ అలాగే తయారీ విధానము ముడి సరుకు అన్నీ కూడా ఫ్రాంచైజీ వారే అందిస్తారు తద్వారా మీరు వ్యాపారం చేయడం సులభం అవుతుంది. 

ఫుడ్ బిజినెస్ చేసే ముందుగా మీరు మంచి స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా కాలేజీలు, విద్యాసంస్థలు  వాణిజ్య స్థలాలు ఎంపిక చేసుకోవాలి అక్కడే మీరు ఇలాంటి ఫుడ్ బిజినెస్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుంటే చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.  వడపావ్ ఫ్రాంచైజీని మీరు రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకూ అందుబాటులో ఉంటుంది. అయితే నియమ నిబంధనలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ వ్యాపారంలో పెట్టుబడి పెడితే మంచిది. ఈ వ్యాపారంలో కనీసం నెలకు రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకూ సంపాదించవచ్చు. 
 

click me!