Business Ideas: ఈ బిజినెస్ చేస్తే కాలు కదపకుండా నెలకు రూ. 1 లక్ష మీ సొంతం అయ్యే చాన్స్..ప్రభుత్వ లోన్ లభ్యం

First Published | Sep 11, 2023, 4:49 PM IST

నిరుద్యోగులు మీరు బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా..అయితే ఎప్పటికీ డిమాండ్ ఉండే ఓ బిజినెస్ గురించి తెలుసుకోండి. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు ప్రతి నెల రూ. 1 లక్ష రూపాయల వరకూ సంపాదించే వీలుంది. 

నిరుద్యోగులు వ్యాపారం కోసం పెట్టుబడి కావాలని ఎదురు చూస్తున్నారా..అయితే ఇక ఏ మాత్రం దిగులు చెందవద్దు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం  కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి,  అదే విధంగా ఉన్న వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలి అనుకునే వారికి  ముద్ర రుణాల పేరిట ఆర్థిక సహాయం అందిస్తోంది.  దీని కింద మీరు 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది. 

ముద్రా రుణాల ద్వారా లోన్ పొందినవారు సులభ వాయిదాలలో చెల్లించవచ్చు. ఎటువంటి ఆస్తులను తనకా లేకుండానే మీరు ఈ రుణాలను పొందే అవకాశం ఉంది.  అన్ని ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా ముద్ర రుణాలను పొందే అవకాశం ఉంది.   ముద్రా స్కీమ్ ద్వారా పొందిన రుణాలను సులభ వాయిదాలు చెల్లించుకోవచ్చు. 


ఇప్పుడు మూలధనం పొందిన తర్వాత మీరు ఏ వ్యాపారం చేయాలా అని ఆలోచిస్తున్నారా అయితే మీరు  పాదరక్షల దుకాణం పెట్టుకోవడం ద్వారా మీరు చక్కటి ఆదాయం పొందవచ్చు.  ప్రస్తుతం మార్కెట్లో అనేక పెద్ద పెద్ద కంపెనీలు సైతం ఈ పాదరక్షల వ్యాపారంలో కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయి.  పాదరక్షలకు ప్రతిసారి డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది.  ముఖ్యంగా మహిళలకు సంబంధించి  పాదరక్షల విషయంలో ఎప్పటికప్పుడు  ట్రెండుకు తగ్గట్టు మారుస్తూ ఉంటారు.  తద్వారా మార్కెట్లో వీటికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.  అదేవిధంగా చిన్న పిల్లల పాదరక్షలు కూడా తరచూ మారుస్తూ ఉంటారు. 

మీరు పాదరక్షలు షో రూమ్ పెట్టాలి అనుకున్నట్లయితే మార్కెట్లో లభించే బ్రాండెడ్,  అలాగే బ్రాండెడ్ కానటువంటి పాదరక్షలను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.  50 శాతం నుంచి 30% వరకు మీకు మార్జిన్ లాభం లభిస్తుంది.  అదే బ్రాండెడ్ కానటువంటి పాదరక్షలపై  మరింత ఎక్కువ మార్జిన్ లాభం లభిస్తుంది.  కానీ బ్రాండెడ్ పాదరక్షలు క్వాలిటీ విషయంలో చాలా మన్నికైనవిగా భావిస్తారు.  సాధారణంగా ప్రజలు మన్నికైనటువంటి పాదరక్షలు ధరించేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. 

అదేవిధంగా స్పోర్ట్స్ షూస్, స్కూల్ షూస్,  ఆఫీస్ షూస్  వంటి బూట్లను కూడా  అందుబాటులో ఉంచినట్లయితే మీకు మరింత ఎక్కువ వ్యాపారం జరిగే అవకాశం ఉంది.  కంపెనీ మ్యానుఫ్యాక్చర్ నుంచి మీరు పాదరక్షలను సప్లై పొందినట్లయితే తక్కువ ధరకే మీకు పాదరక్షలు లభిస్తాయి.  ముఖ్యంగా స్కూల్ తెరిచిన సీజన్లో స్కూల్ షూస్ కు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.  అందుకే అటువంటి పాదరక్షలను అందుబాటులో ఉంచుకుంటే చాలా మంచిది.

 మీరు పాదరక్షలు దుకాణం తెరవాలి అనుకున్నట్లయితే  జన సమర్థం ఎక్కువ ఉన్న ప్రదేశంలో ఓ షాపును అద్దెకు తీసుకుంటే సరిపోతుంది. . ప్రారంభంలో ఒక లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు.  వ్యాపారం బాగా జరిగినట్లయితే నెలకు ఒక లక్ష రూపాయలు మిగిలి అవకాశం ఉంది.  లేదంటే కనీసం 50 వేల రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంది. 

Latest Videos

click me!