ఈ నేపథ్యంలో మీరు చిరుధాన్యాలను ఉపయోగించి తినుబండారాలను తయారు చేసినట్లయితే, మీరు చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు రాగి పిండితో చేసినటువంటి మురుకులు, అప్పాలు, ఇతర చిరుతిళ్లకు ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే కొర్రలు, సామలు, అరికెలు వంటి చిరుధాన్యాలతో బ్రేక్ ఫాస్ట్ పదార్థాలను కూడా తయారు చేయవచ్చు. వీటితో ఇడ్లీలు, దోసెలు, ఊతప్పం, గారెలు వంటివి తయారు చేసి ఉదయం పూట ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసి విక్రయించడం ద్వారా మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. చిరుధాన్యాలతో చేసిన ఇడ్లీ , దోసెల పిండి, బిస్కెట్లకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది.